సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 22 మే 2017 (14:10 IST)

బాలికపై సీ లయన్ దాడి... ఏం చేసిందో చూడండి (Video)

కెనడాలో సముద్రపు సీల్ ఒకటి ఊహించని విధంగా భయనాక రీతిలో ఓ బాలికపై దాడి చేసి నీటిలోకి లాగేసింది. సముద్రం డాక్‌పై కూర్చోనివున్న ఆ బాలిక... నీటిలో తేలియాడుతున్న సీలైన్‌ను చూసి ఆనందిస్తోంది. సీలైన్‌ డాక్‌

కెనడాలో సముద్రపు సీల్ ఒకటి ఊహించని విధంగా భయనాక రీతిలో ఓ బాలికపై దాడి చేసి నీటిలోకి లాగేసింది. సముద్రం డాక్‌పై కూర్చోనివున్న ఆ బాలిక... నీటిలో తేలియాడుతున్న సీలైన్‌ను చూసి ఆనందిస్తోంది. సీలైన్‌ డాక్‌ ఒడ్డుకు రావడంతో దానిని చూసి మరింత ముచ్చటపడింది.
 
ఇంతలో ఆ బాలిక డాక్‌ అంచుల మీద కూర్చోగా.. ఒక్కసారిగా భయానకరీతిలో సీలైన్‌ బాలికపై దాడి చేసి.. నీటిలోకి లాగేసింది. దీంతో చూపరులు భయాందోళనకు గురై.. కేకలు వేశారు. ఓ వ్యక్తి తెగించి నీటిలోకి దుంకి బాలికను కాపాడాడు. ఇంతలోనే సీలైన్‌ నీటిలో మాయమైంది.
 
సీలైన్‌ అమాంతం నీటిలోకి లాగేసినా.. బాలికకు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఆమె తన వారితో కలిసి మామూలుగా నడుచుకుంటూ వెళ్లింది. ఈ అనూహ్య ఘటన కెనడా పశ్చిమ తీరంలోని వాంకోవర్‌ పట్టణం రిచ్‌మండ్‌ బీచ్‌లో శనివారం జరిగింది. జరిగిన సంఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది వైరల్‌గా మారింది.