ఆమె కోసం చేయి చాచిన ట్రంప్... షాకిచ్చిన పోలెండ్ ప్రెసిడెంట్ వైఫ్(వీడియో)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుకు మహిళలు వీలున్నప్పుడల్లా షాకులిస్తూనే వున్నారు. తాజాగా పోలెండ్ అధ్యక్షుడి సతీమణి ట్రంపుకు భారీ షాకిచ్చింది. ఆమె ఇచ్చిన షాక్ తో ట్రంప్ ముఖం బేలగా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది...? వివరాల్లోకి వెళితే... అమెరికా అధ్య
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపుకు మహిళలు వీలున్నప్పుడల్లా షాకులిస్తూనే వున్నారు. తాజాగా పోలెండ్ అధ్యక్షుడి సతీమణి ట్రంపుకు భారీ షాకిచ్చింది. ఆమె ఇచ్చిన షాక్ తో ట్రంప్ ముఖం బేలగా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది...? వివరాల్లోకి వెళితే... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సతీమణితో సహా పోలెండ్ పర్యటకు వెళ్లారు.
ఆ సందర్భంగా వారిని ఆహ్వానించేందుకు పోలెండ్ అధ్యక్షుడు ఆండ్ర్ జెజ్ దువా, ఆయన సతీమణి సంసిద్ధమయ్యారు. అమెరికా అధ్యక్షుడు అక్కడికి రాగానే జెజ్ దువా ట్రంపుతో కరచాలనం చేశారు. ఇంతలో ఆయన సతీమణి కోర్న్ హౌజర్ దువా కూడా ముందుకు వచ్చారు. దీనితో ట్రంప్ కరచాలనం చేసేందుకు చేయిని చాచారు.
కానీ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. నేరుగా ట్రంప్ భార్య మెలానియాకు ఇచ్చింది. దీంతో ట్రంప్ బేలగా ఆమె వైపు అలా చూస్తుండిపోయారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మీరూ చూడండి.