శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2016 (10:13 IST)

అమెరికాలో జాత్యహంకార దాడి.. భారత సిక్కు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై దాడి

అమెరికాలో మరో జాత్యహంకార దాడి జరిగింది. భారత సిక్కు సాఫ్ట్‌వేర్‌పై ఈ దాడి జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. కాలిఫోర్నియాలో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్న మాన్‌సింగ్ ఖల్సా గత నెల 25న విధులు ముగించుకుని ఇ

అమెరికాలో మరో జాత్యహంకార దాడి జరిగింది. భారత సిక్కు సాఫ్ట్‌వేర్‌పై ఈ దాడి జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే.. కాలిఫోర్నియాలో ఐటీ నిపుణుడిగా పనిచేస్తున్న మాన్‌సింగ్ ఖల్సా గత నెల 25న విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఆయన ప్రయాణిస్తున్న కారుపై దుండుగులు బీర్ క్యాన్ విసిరారు. అనంతరం కారును వెంబడించి మరీ దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలు తెరిచి ఉండడంతో ఆయన తలపాగా తీసేశారు. ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. జుట్టు కత్తిరించారు. 
 
దుండగుల వయసు 20-30 ఏళ్ల మధ్యలో ఉంటుందని ఖల్సా తెలిపారు. దాడి ఘటనపై సిక్కు సంఘాలు రిచ్‌మండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేశాయి. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దుండగులపై జాతి విద్వేష దాడి కింద కేసు నమోదు చేయాలని మానవహక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.