వామ్మో.. ఆలూ చిప్స్ డబ్బాల్లో నల్లత్రాచులు...
అరుదైన, అత్యంత విలువైన వస్తువుల అక్రమ రవాణాకు స్మగ్లర్లు వివిధ మార్గాలను ఎంచుకుంటుంటారు. ఈ కోవలోనే అరుదైన జాతి నల్లత్రాచు పాముల ఎగుమతి కోసం సరికొత్త పంథాను ఎంచుకున్నారు. అలూ చిప్స్ డబ్బాల్లో నల్లత్రాచ
అరుదైన, అత్యంత విలువైన వస్తువుల అక్రమ రవాణాకు స్మగ్లర్లు వివిధ మార్గాలను ఎంచుకుంటుంటారు. ఈ కోవలోనే అరుదైన జాతి నల్లత్రాచు పాముల ఎగుమతి కోసం సరికొత్త పంథాను ఎంచుకున్నారు. అలూ చిప్స్ డబ్బాల్లో నల్లత్రాచులను ఉంచి చేస్తున్న స్మగ్లింగ్ గుట్టును పోలీసులు ఛేదించారు. ఈ వివరాలను పరిశీలిస్తే...
కాలిఫోర్నియాకు చెందిన రోడ్రిగో ఫ్రాంకో అనే వ్యక్తికి హాంకాంగ్ నుంచి రెండు పార్శిల్ డబ్బాలు వచ్చాయి. వీటిపై ఆలూచిప్స్ అని రాసివుండటంతో ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులకు ఎలాంటి అనుమానం రాలేదు. దీంతో రెండు డబ్బాల్లో ఒకదాన్ని ఫ్రాంకో ఇంటికి అధికారులు కొరియర్ చేశారు.
ఇంతలో ఆ ఆలూచిప్స్ డబ్బాలను తనిఖీ చేయాలని పై అధికారులు సెర్చ్ వారెంట్ జారీచేశారు. దీంతో రెండో డబ్బాను తెరిచి చూడగా అధికారులు షాక్‌కు గురయ్యారు. ఆ డబ్బాలో అరుదైన జాతి నల్లత్రాచు పాము పిల్లలు ప్రాణాలతో ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఇంతకుముందు ఇంటికి పంపిన దాన్ని కూడా వెళ్లి చూస్తే అందులో రెండు తాబేలు పిల్లలు, రెండు మొసలి పిల్లలు కనిపించాయి.
ఈ బాక్సులను హాంగ్‌కాంగ్ నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి రోడ్రిగోను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఇంతకుముందు కూడా తనకు హాంగ్‌కాంగ్ నుంచి 20 నల్లత్రాచు పిల్లలు వచ్చాయని, కాకపోతే అవి దారిలో చనిపోవడంతో రక్షణ కోసం ఈసారి ఆలూ చిప్స్ డబ్బాల్లో పెట్టి పంపించారని రోడ్రిగో వెల్లడించడంతో కస్టమ్స్ అధికారులు ఖంగుతిన్నారు.