శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 ఆగస్టు 2024 (12:41 IST)

టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్‌ అరెస్టు!!

Pavel Durov
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్‌ పారిస్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అజర్ బైజాన్ నుంచి లే బోర్గట్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనను ఫ్రెంచ్ ఎయిర్‌పోర్టులో పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాల్ని ప్రోత్సహించడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. దీంతో గతంలో అరెస్టు వారెంట్ జారీ చేసిన అధికారులు... తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పైగా, తనపై అరెస్టు వారెంట్ ఉన్నప్పటికీ పావెల్ దురోవ్ పారిస్‌కు రావడంపై విచారణ అధికారి ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పావెల్‌ను ఆదివారం కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత జైలుకు తరలించే అవకాశం ఉంది.  
 
కాగా, రష్యాలో పుట్టిన పావెల్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉంటున్నారు. ఆయనకు ఫ్రాన్స్, యూఏఈ పౌరసత్వాలు ఉన్నాయి. కాగా, ఆయనపై మోసం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, వ్యవస్థీకృత నేరాలను ప్రోత్సహించడం వంటి అభియోగాలున్నాయి. ఆయనపై గతంలోనే అరెస్ట్ వారెంట్ జారీ కాగా, తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
 
తనపై అరెస్టు వారెంట్ ఉన్నప్పటికీ పావెల్ పారిస్ రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పావెల్ అరెస్ట్‌పై టెలిగ్రాం ఇప్పటి వరకు స్పందించలేదు. 15.5 బిలియన్ డాలర్ల సంపద కలిగిన దురోవ్ 2014లో రష్యాను విడిచిపెట్టారు. ఆయన తన సోదరుడు నికోలాయ్‌తో కలిసి 2013లో టెలిగ్రామ్‌ యాప్‌ను తీసుకొచ్చారు. దీనికిప్పుడు ప్రపంచవ్యాప్తంగా 900 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు.