శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2016 (10:15 IST)

ద్వారకా, సోమ్‌నాథ్‌ ఆలయాల విధ్వంసానికి కుట్ర : కేంద్ర నిఘా వర్గాలు

ద్వారకా, సోమనాథ్ ఆలయాల విధ్వంసానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నారనీ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జవాన్లు సర్జికల్ దాడులు జరిపినందుకు

ద్వారకా, సోమనాథ్ ఆలయాల విధ్వంసానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్ర పన్నారనీ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జవాన్లు సర్జికల్ దాడులు జరిపినందుకు ప్రతీకారం తీర్చుకునేలా భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు తీవ్రవాదులు కుట్ర పన్నినట్టు సమాచారం. 
 
ఈ రెండు ప్రధాన ఆలయాలతో పాటు దాదాపు 12 నుంచి 15 మంది ఐఎస్ఐ ఏజెంట్లు జలమార్గం ద్వారా గుజరాత్ తీరంలో ప్రవేశించవచ్చని, లేదంటే ఇప్పటికేచొరబడి ద్వారక, మండల్‌ పట్టణాల్లో నక్కి ఉండవచ్చని సీఐ హెచ్చరించిందని గుజరాత్ డీజీపీ పేర్కొన్నారు. అదేవిధంగా అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దు వద్ద రెండు ఫిషింగ్‌ బోట్లు భారత జలాల్లోకి చొరబడేందుకు సిద్ధంగా ఉన్నాయనీ పేర్కొన్నట్లు చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్‌ను ప్రకటించారు. 
 
కచ్‌ ప్రాంతంలో ద్వారకలోకి ప్రవేశించే ప్రయత్నంలో ఉన్న పాక్‌కు చెందిన బోటును బుధవారం అధికారులు సీజ్‌ చేశారు. బోటులో 9 మంది పాక్‌ సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల తనిఖీల్లో వీరి వద్ద పేలుళ్లకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని సమాచారం. అయితే వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.