1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 25 జులై 2016 (15:39 IST)

'వెల్‌కమ్ బోర్డు'ను దొంగిలించి సీసీ కెమెరాలకు చిక్కింది!

సమాజంలో వివిధ రకాల దొంగతనాలు జరుగుతుంటాయి. కొందరు ఆకలిని తీర్చుకునేందుకు దొంగతనం చేస్తే.. మరికొందరు జల్సాల కోసం చోరీలు చేస్తుంటారు. ఇంకొందరు చిల్లర దొంగతనాలు చేస్తూ చిక్కుల్లో పడుతుంటారు.

సమాజంలో వివిధ రకాల దొంగతనాలు జరుగుతుంటాయి. కొందరు ఆకలిని తీర్చుకునేందుకు దొంగతనం చేస్తే.. మరికొందరు జల్సాల కోసం చోరీలు చేస్తుంటారు. ఇంకొందరు చిల్లర దొంగతనాలు చేస్తూ చిక్కుల్లో పడుతుంటారు. 
 
ఇలాంటి దొంగతనమే ఒకటి టెక్సాస్‌లో జరిగింది. హారిస్ కౌంటీకి చెందిన కార్లే విలియమ్స్(30) ఓ ఇంటిముందున్న వెల్‌కమ్ బోర్డును దొంగిలించి కటకటాలపాలైంది. దాంతోపాటు అమెరికా జాతీయ పతాకంతో తయారు చేసిన మరో అలంకరణను దొంగిలించింది. పాపం.. ఆమె చేతివాటం కాస్తా సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో జైలుపాలు కాక తప్పలేదు. 
 
నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె దొంగిలించిన వెల్‌కమ్ బోర్డు, వస్త్రంతో తయారుచేసిన పూలదండలాంటి అలంకరణను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలికి ‘ఇలాంటి’ దొంగతనాలు మామూలేనని పోలీసులు పేర్కొన్నారు.