పుట్టగొడుగులతో బెస్ట్ బ్యాటరీలు... వాహనాలు కూడా నడపవచ్చునట... ఎక్కడ ?
పుట్టగొడుగులతో బ్యాటరీలా..? అదేలా సాధ్యం.. అందునా మరీ ఎక్కవ కాలం మన్నిక కలిగిన బ్యాటరీలను తయారు చేయవచ్చా... అవుననే అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. సాధారణంగా వినియోగించే సెల్ బ్యాటరీల కంటే తక్కువ ఖర్చుతో తయారు చేవచ్చునట. వివరాలు ఇలా ఉన్నాయి.
అమెరికాలోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు రక రకాలా ప్రయోగాలు చేశారు. సాధారణంగా లిథియం అయాన్ బ్యాటరీల్లో సింథటిక్ గ్రాఫైట్‌ను వాడతారు. ఈ గ్రాఫైట్‌ను శుద్ధి చేయడం అనేది ఖర్చుతో కూడాకున్న పని. చాలా ఖర్చవుతుంది. అయితే గ్రాఫైట్ బదులుగా ఈ పుట్టగొడుగులను ఉపయోగిస్తే చాలా చవకగా బ్యాటరీలు తయారు చేయవచ్చని చెబుతున్నారు.
పుట్టగొడుగుల్లో సూక్ష్మాతి సూక్ష్మమైన రంధ్రాలుంటాయట. వీటిలో ఎక్కువ శక్తిని నిల్వ చేసుకోగలదట. పుట్టగొడుగులో అధిక పొటాషియం అయాన్లు ఉండటం వల్ల రాను రాను బ్యాటరీ సామర్థ్యం పెరుగుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇంకెందుకు ఆలస్యం పుట్టగొడుగుల బ్యాటరీని మొదలు పెట్టేస్తే సరిపోయే..