ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ విజయవంతం!
కరోనా కాలంలో కళ్లులింతలా చేసుకుని వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు శుభవార్త! కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న వ్యాక్సిన్ విజయవంతంగా పనిచేస్తోందని తెలిసింది.
ప్రయోగాల్లో ఈ సూది మందును తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తి చైతన్యమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది వారికి ఎలాంటి హాని కలిగించలేదని లాన్సెట్ సైన్స్ జర్నల్ ఎడిటర్ రిచర్డ్ హోర్టన్ వెల్లడించారు. వ్యాక్సిన్ సురక్షితమని, తీసుకున్నవారికి సహించిందని ఆయన పేర్కొన్నారు.
‘ఆక్స్‌ఫర్డ్ కొవిడ్-19 వ్యాక్సిన్ 1/2 దశల ప్రయోగ ఫలితాలు ఇప్పుడు ప్రచురించాం. వ్యాక్సిన్ సురక్షితం. చక్కగా సహిస్తోంది. రోగనిరోధక శక్తిని చైతన్యం చేసింది. రూపకర్తలైన పెడ్రో ఫొల్‌గట్టి, సహచరులకు అభినందనలు. ఈ ఫలితాలు ఆశాజనంగా ఉన్నాయి’ అని రిచర్డ్ ట్వీట్ చేశారు.