అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా తులసీ గబ్బార్డ్.. ఈమె నేపథ్యం ఏంటి?
ఉక్రెయిన్‌కు అమెరికా మద్దతును వ్యతిరేకిస్తూ, సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్‌ను కలిసిన మాజీ డెమొక్రాట్ తులసీ గబ్బార్డ్‌ను డొనాల్డ్ ట్రంప్ బుధవారం తన ఇన్‌కమింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌గా నియమించారు.
"అమెరికన్ ప్రజల భద్రత, భద్రత - స్వేచ్ఛను పరిరక్షించడానికి మీ మంత్రివర్గంలో సభ్యునిగా పనిచేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.. ఇంకా ఆ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధం" అని గబ్బార్డ్ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
సైన్యంలో విధులు నిర్వహించిన తులసి 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ ప్రతినిధిగా పోటీ చేశారు. విజయం సాధించకపోవడంతో, 2022లో డెమోక్రటిక్ పార్టీని విడిచిపెట్టారు. రెండేళ్ల పాటు ఆ పార్టీ విధానాలు నచ్చక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ట్రంప్‌నకు మద్దతు పలికి ప్రచారం చేశారు.
నిజానికి, తులసి గబ్బార్డ్ తల్లి హిందూ మతాన్ని అనుసరిస్తుండగా, ఆమె తండ్రి సమోవాకు చెందినవారు. హిందూ మతంతో ఆతనికి ఉన్న అనుబంధం కారణంగా, ఆమెకు తులసి అని పేరు పెట్టారు. ఆమె సైన్యంలో ఉన్న సమయంలో ఇరాక్‌లో కూడా విధులు నిర్వహించారు.
తులసి భారతీయురాలు కాదు. గబ్బార్డ్‌కు భారత్‌తో ఎలాంటి సంబంధం లేదు. ఆమె తల్లి హిందూ మతాన్ని స్వీకరించింది. ఇప్పుడు తులసి హిందూ మతాన్ని అనుసరిస్తోంది.