శుక్రవారం, 15 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 26 జనవరి 2017 (02:11 IST)

ఈ ప్రపంచంలో భారత్ మా నిజమైన ప్రెండ్: మోదీకి ట్రంప్ ఆహ్వానం

ప్రపంచాన్ని ఆవరించిన సవాళ్లను ఎదుర్కోవడంలో అమరికాకు ఇండియానే నిజమైన మిత్రదేశమని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. వీలు చూసుకుని ఈ ఏడాది అమెరికాను సందర్శించాలని భారత ప్రధాని నరేంద్రమోదీని ట్రంప్ ఆహ్వానించారు.

ప్రపంచాన్ని ఆవరించిన సవాళ్లను ఎదుర్కోవడంలో అమరికాకు ఇండియానే నిజమైన మిత్రదేశమని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. వీలు చూసుకుని ఈ ఏడాది అమెరికాను సందర్శించాలని భారత ప్రధాని నరేంద్రమోదీని ట్రంప్ ఆహ్వానించారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరాటంలో భుజం కలిపి నిలవాలని ఈ సందర్భంగా ఇరుదేశాలూ ప్రతిజ్ఞ చేశాయి.
 
భారత ప్రధాని నరేంద్రమోదీకి కాల్ చేసి మాట్లాడిన ట్రంప్ ఆర్థికరంగం, రక్షణ వంటి విస్తృత రంగాల్లో తమ మధ్య ఉన్న బాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశాల గురించి చర్చించారు. భారత్ తమకు నిజమైన  ఫ్రెండ్ అని ట్రంప్ వ్యాఖ్యానంచడంలో ఒబామా, బుష్ హయాంలో అమెరికా ప్రయోగించిన పదాలతో సారూప్యత కలిగి ఉండటం గమనార్హం. 
 
అయితే ఇరుదేశాలూ చర్చలకు సిద్ధమైనప్పుడు బుష్-ఒబామా పాలనలో జరిగిన చర్చలకు భిన్నంగా ఉంటాయన్నది స్పష్టం. గత గురువారం బ్రిటన్ ప్రధాని థెరెస్సా మేని కలవడం ద్వారా విదేశీ నేతలతో మాట్లాడటం ప్రారంభించిన ట్రంప్‌ కాల్ చేసిన విదేశీ ప్రముఖులలో భారత ప్రధాని అయిదో స్థానంలో ఉన్నారు. 
 
ట్రంప్ జాతీయ వాద విధానం భారత్-అమెరికా సంబంధాలపై గణనీయంగానే ప్రభావం చూపనుంది. వలస సమస్య, హెచ్1 బి ఫారాలను విచ్చలవిడిగా అమెరికాలోని భారతీయ ఐటీ కంపెనీలు వాడటంపై ట్రంప్ ఇప్పటికే ఆంక్షలు విధిస్తానని చెప్పడం నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాలు సంక్లిష్టతలతోనే ప్రారంభవవుతాయని పరిశీలకుల భావన.