గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 13 మార్చి 2017 (10:32 IST)

ట్రంప్ సర్కారు సంచలన నిర్ణయం.. ప్రీత్ భరారాపై వేటు.. రాజీనామాను తిరస్కరించడంతో?

ఏడు ముస్లిం దేశాలపై విధించిన నిషేధం ఉత్తర్వులు కోర్టు ముందు నిలవకపోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లే కారణమని భావించిన అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ సర్కారు 46 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను రాజీనామా చేయ

ఏడు ముస్లిం దేశాలపై విధించిన నిషేధం ఉత్తర్వులు కోర్టు ముందు నిలవకపోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లే కారణమని భావించిన అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ సర్కారు 46 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను రాజీనామా చేయాలని ఉత్తర్వులను జారీచేసింది. అందుకు తిరస్కరించిన భారత సంతతికి చెందిన ప్రీత్ భరారా (48)ను పదవి నుంచి తొలగించింది. తద్వారా ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 
 
అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన హై ప్రొఫైల్‌ ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లలలో ఒకరిగా ప్రీత్ భరారాకు పేరుంది. తాను రాజీనామా చేయలేనని ప్రకటించిన కొద్ది సేపట్లోనే తనను తొలగించారని ప్రీత్ భరారా వెల్లడించారు. సౌత్‌రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ (ఎస్‌డీఎన్‌వై) పరిధిలో అమెరికా అటార్నీగా పని చేయడం వృత్తిపరంగా గౌరవంగా భావిస్తానని ప్రీత భరారా ట్వీట్‌ చేశారు.
 
ఫెడరల్‌ అటార్నీగా ఏడేళ్లు పనిచేయడం తన వృత్తి జీవితానికి లభించిన అరుదైన గౌరవంగా భావిస్తానని చెప్పుకొచ్చారు. అయితే, 2013లో భారత దౌత్యవేత్త దేవయాని ఖొబ్రగాడే వివాదాస్పద అరెస్టు విషయంలో భరారా కీలక పాత్ర పోషించారు.