శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2019 (18:58 IST)

రెండు నోర్లు ఉన్న చేపను మీరు ఎప్పుడైనా చూసారా?

సాధారణంగా మనం చూసే చేపలు ఒక నోటిని మాత్రమే కలిగి ఉంటాయి. అయితే ఒక చేపకు రెండు నోరులు ఉంటాయని మీరు ఎప్పుడైనా చూసారా? వింటుంటేనే వింతగా ఉంది కదూ.. అయినా నమ్మక తప్పదు.. ఈ విచిత్రమైన చేప అమెరికాలో ఓ మహిళకు కనిపించింది. సదరు మహిళ ఈ చేపను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
 
అమెరికాలో నివసిస్తున్న డెబ్బీ గెడ్డెస్ అనే మహిళకు చేపల వేటంటే చాలా ఇష్టమట. తన భర్తతో కలిసి మంగళవారం (ఆగస్ట్ 20,2019) నాడు లేక్ చాంప్లెన్‌లో చేపలు పట్టేందుకు వెళ్లింది. 
 
అక్కడ చేపలు పడుతున్న సమయంలో ఆమెకు అన్ని చేపలలోకి ఒక చేప వింతగా కనిపించింది. దానిని పట్టుకుని చూస్తే, ఆ చేపకు కాస్త రెండు నోర్లు ఉండడం చూసి ఒక్క సారిగా అవాక్కయిందట. వెంటనే ఆ చేపను పట్టుకుని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తెగ వైరల్‌గా మారాయి.