శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శుక్రవారం, 9 ఆగస్టు 2019 (14:14 IST)

రకుల్ ప్రీత్ సింగ్ లిప్ లాక్ సీన్... చిన్మయిపై నెటిజన్స్ ట్రోల్స్

ఫోటో కర్టెసీ - సోషల్ మీడియా
మన్మథుడు 2 చిత్రం విడుదలయింది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ సిగరెట్ తాగడంపై గతంలో నెటిజన్లు ఫైర్ అయ్యారు. విమర్శనాస్త్రాలు సంధించారు. ఐతే చిన్మయి మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంతకంటే ఎక్కువగానే చూపిస్తున్నారనీ, ఉదాహరణగా కబీర్ సింగ్ చిత్రం గురించి చెప్పారు. 
 
ఐతే నెటిజన్లు మాత్రం వదలడంలేదు. తాజాగా మన్మధుడు 2 చిత్రం విడుదలయింది. ఈ నేపధ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ తన సహచర నటికి లిప్ లాక్ ఇస్తుంది. ఇప్పుడు ఈ లిప్ లాక్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. చిన్మయి భర్త రాహుల్ సినిమాలో బోల్డు కంటెంట్ చూపిస్తుంటే చిన్మయి మాత్రం నీతులు ఎలా చెప్తారంటూ విమర్శిస్తున్నారు.
 
‘మన్మధుడు 2'లో రకుల్ స్మోకింగ్ సీన్, హీరోయిన్ బటన్ విప్పడం, ప్లర్టింగ్ చేయడం వంటివి చూపిండం ద్వారా ఈ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు?'' అంటూ చిన్మయిపైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరి దీనిపై చిన్మయి ఎలా రియాక్ట్ ఎవుతుందో చూడాలి.