శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2019 (12:17 IST)

బావామరదలి వార్.. కథనంతో సోగ్గాడికి చెక్.. అనసూయ గట్టిదే..

సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో అక్కినేని నాగార్జునకు మరదలుగా అనసూయ నటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బావామరదలి మధ్య వార్ జరుగుతుందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. అంతేగాకుండా అనసూయ నాగార్జునతో పోటీ పడుతోంది. ప‌్ర‌స్తుతం ఈమె వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది. ఒక్కో సినిమాతో త‌న ఇమేజ్ పెంచుకుంటూ వెళ్తుంది. 
 
ముందుగా అనసూయ నటిగా కాకుండా.. కేవ‌లం గ్లామ‌ర్ షో మాత్ర‌మే చేసి ఇమేజ్ తెచ్చుకుంది‌. కానీ క్ష‌ణం సినిమా త‌ర్వాత త‌నలో న‌టి కూడా ఉంద‌ని నిరూపించుకుంది. ఇంకా రంగస్థలంలో రంగమ్మత్తగా అదరగొట్టేసింది. తాజాగా ఈమె నటిస్తున్న కథనం సినిమా ఆగస్టు తొమ్మిదో తేదీన విడుదల కానుంది. 
 
ఈ నేపథ్యంలో ''కథనం'' పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్‌లో టార్చ్ పట్టుకుని దేనికోసమో వెతుకుతుంది ఈ భామ. ఆ మధ్య వచ్చిన పోస్టర్‌లో ఏకంగా శ‌వాల మ‌ధ్య‌లో కూర్చుంది అన‌సూయ‌. ఈ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. 
 
క‌థ‌నం సినిమాలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ పాత్ర‌లో న‌టిస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ సినిమాతో అనసూయ నాగార్జునతో పోటీపడుతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. మన్మథుడు 2తో వస్తున్న నాగార్జునకు  బాక్సాఫీస్ దగ్గర అనసూయ గట్టిపోటీ ఇవ్వనుందట.