బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (11:05 IST)

భారతీ విమానాలపై నిషేధం పొడగింపు...

మన దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి క్రమంగా తగ్గుతుంది. అయినప్పటికీ విదేశాలకు వెళ్లే విమాన సర్వీసులపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో భారతీయ విమానాలపై నిషేధాన్ని యూఏఈ పొడిగించింది. ఈ మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రకటన విడుదల చేసింది. 
 
కరోనా వ్యాప్తిని నియంత్రించడం కోసం భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధాన్ని జూన్ 30 వరకూ పొడిగించాలని యూఏఈ నిర్ణయించింది. ఏప్రిల్ నెలలో ఈ బ్యాన్ మొదలైంది. గడిచిన 14 రోజుల్లో భారత్‌కు వెళ్లొచ్చిన విదేశీ ప్రయాణికులెవర్నీ యూఏఈలోకి రాకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పుడు ఆ నిషేధాన్ని జూన్ 30 వరకూ పొడిగించింది.
 
మరోవైపు, దేశ వ్యాప్తంగా రోజువారీ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. మంగళవారం 92,596 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దాని ప్రకారం... నిన్న 1,62,664 మంది కోలుకున్నారు. 
 
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య  2,90,89,069కు చేరింది. మరో 2,219 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,53,528కు పెరిగింది.
 
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,75,04,126 మంది కోలుకున్నారు. 12,31,415 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 23,90,58,360 మందికి వ్యాక్సిన్లు వేశారు.