శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 9 మార్చి 2022 (09:36 IST)

నాకు NATOపై ఇంట్రెస్ట్ పోయింది, పుతిన్‌తో శాంతియుత చర్చలకు సిద్ధం: జెలెన్స్‌కీ సంచలన వ్యాఖ్యలు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్‌కీ సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకు NATOలో చేరాలన్న ఆసక్తి పోయిందనీ, ఇంట్రెస్ట్ లేదన్నారు. మోకాళ్లపై కూర్చుని అడుక్కోలేమనీ, ఉక్రెయిన్ ప్రజలు తనను అలా చూడలేరన్నారు. అందుకే నాటో కోసం ఎగబడటం కంటే రష్యాతో యుద్ధాన్ని ముగించేందుకు శాంతియుత చర్చలకు తను సిద్ధంగా వున్నట్లు తేల్చి చెప్పారు. దీనితో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది.

 
రష్యన్ అధికారులు ఉక్రెయిన్ ముందు నాలుగు డిమాండ్లను ఉంచారు. యుద్ధాన్ని ఆపేయాలంటే... ఉక్రెయిన్ NATO లేదా యూరోపియన్ యూనియన్ సభ్యత్వాన్ని కొనసాగించకూడదు. క్రిమియాను రష్యన్ భూభాగంగా గుర్తించాలి. లుగాన్స్క్, డొనెట్స్క్ ప్రాంతాలను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తించాలి.

 
ఈ నాలుగు డిమాండ్లకు ఉక్రెయిన్ అంగీకరిస్తే యుద్ధాన్ని ఆపివేసేందుకు రష్యా సిద్ధంగా వున్నట్లు తెలిపారు. ఐతే అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు విధించిన ఆంక్షలతో రష్యా తీవ్ర ఆగ్రహంతో వుంది. ఈ పరిస్థితుల్లో యుద్ధంపై పుతిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి వుంది.