గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 21 నవంబరు 2017 (15:33 IST)

2018 భూకంపాలే భూకంపాలు.. అధిక జనాభా ప్రాంతాలకే ముప్పు

ప్రముఖ ఫ్రెంచ్‌ భవిష్యకారుడు నోస్ట్రడామస్‌ భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ముందుగానే చెప్పేశారు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానాన్ని మనమెలా విశ్వసిస్తామో.. భవిష్యకారుడు నోస్ట్రడామస్ చ

ప్రముఖ ఫ్రెంచ్‌ భవిష్యకారుడు నోస్ట్రడామస్‌ భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ముందుగానే చెప్పేశారు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానాన్ని మనమెలా విశ్వసిస్తామో.. భవిష్యకారుడు నోస్ట్రడామస్ చెప్పిన దానిని కూడా ప్రపంచ వ్యాప్తంగా విశ్వసిస్తుంటారు. ఇప్పటికే డేనియల్‌ మాన్సన్‌ అనే శాస్త్రవేత్త భూమి వైపు ఏదో గ్రహం దూసుకొస్తోందని, దాంతో భూమి అంతరించిపోతుందని ప్రకటించేశారు. ఈ పరిణామం వచ్చే ఏడాదిలోనే వుంటుందని హెచ్చరించారు. 
 
ఈ విషయాన్ని అంటే 2018లో మహా విపత్తులు సంభవిస్తాయి. పెను వినాశనం తప్పదు. భూగోళంపై మనుష్య జాతి పెద్ద సంఖ్యలో అంతమవుతుందని నోస్ట్రడామస్ కూడా ముందే చెప్పేశారు. ఈయన చెప్పిన ప్రకారమే 2018లో సునామీలు, వరదలు, భూకంపాలు తప్పవని సమాచారం. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు పట్టికుదిపేసే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 
 
యూనివర్శిటీ ఆఫ్‌ కొలరాడో, యూనివర్శిటీ ఆఫ్‌ మోంటానాకి చెందిన శాస్త్రవేత్తలు రాబర్ట్‌ బిల్హామ్‌, రెబెక్కాలు 2018లో భూభ్రమణ వేగం పెరగడంతో భూకంపాలు తప్పవంటున్నారు. ప్రతి ఐదేళ్లకోసారి భూభ్రమణ వేగం మారుతూ వుంటుందని.. 32 ఏళ్లకోసారి తీవ్రమైన భూకంపాలు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఐతే గత నాలుగేళ్ల పాటు భూభ్రమణ వేగం తక్కువగానే ఉంది కనుక గడచిన నాలుగేళ్ల కాలంలో ఏటా సగటు పెద్ద 15 భూకంపాలు వచ్చాయన్నారు. కానీ 2018 ఐదో సంవత్సరం అవుతుంది కాబట్టి భూభ్రమణ వేగం పెరిగి.. 30 వరకు భారీ భూకంపాలు ఏర్పడే ప్రమాదముందని వారు హెచ్చరించారు. 
 
1900 కాలం నుంచి ఇప్పటివరకు ఏర్పడిన భూకంపాలపై అధ్యయనం జరిపిన శాస్త్రవేత్తలు.. భూభ్రమణ వేగం ఎక్కువ, తక్కువగా ఉన్నప్పుడే తీవ్రమైన భూకంపాలు సంభవిస్తున్నాయని తెలిపారు. అది కూడా జనాభా అధికంగా గల ప్రాంతాల్లోనే ఈ భూకంపాలు సంభవిస్తున్నాయని తెలిపారు.

ఇందులో భాగంగా 2017లో 15 నుంచి 20 తీవ్రమైన భూకంపాలు సంభవించగా, 2018లో 25 నుంచి 30 వరకు తీవ్రమైన భూకంపాలు వచ్చే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.