శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 27 ఫిబ్రవరి 2021 (10:16 IST)

సిరియాలో అమెరికా వైమానిక దాడి.. 17మంది ఉగ్రవాదులు మృతి

సిరియాలోని ఉగ్రవాదుల శిబిరాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా యుద్ధ విమానాలు దాడులు చేశాయి. పెద్ద ఎత్తున జరిగిన ఈ దాడుల్లో 17మంది ఉగ్రవాదులు మృతి చెందారని అమెరికా పేర్కొన్నది. సిరియా-ఇరాక్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాదులే లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు చేసింది అమెరికా.
 
ఇరాన్ ప్రోద్బలంతో సిరియాలో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని అమెరికా ఆరోపణలు చేస్తుంది. అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ అధికారంలోకి వచ్చిన 36 రోజుల్లోనే ఈ దాడులకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. అమెరికన్లకు, సిబ్బంది రక్షణకు ఎలాంటి చర్యలకైనా జో బైడెన్ వెనకాడబోరని ఈ దాడుల ద్వారా స్పష్టం అయ్యింది.