శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 13 అక్టోబరు 2020 (20:51 IST)

ఎథర్ గ్రిడ్‌తో భారతదేశపు ఎథర్ ఎనర్జీ అతి పెద్ద పబ్లిక్ ఛార్జింగ్ నెట్‌వర్క్ ఏర్పాటు

"ఎథర్ గ్రిడ్ బెంగళూరు మరియు చెన్నైలలో స్థిరమైన అడాప్షన్‌ని చూసింది, మేం ప్రవేశించే ఏ మార్కెట్‌లోనైనా మా ప్రొడక్ట్‌లను ప్రారంభించటానికి ముందు యాక్సెస్ చేసుకునే ఛార్జింగ్ నెట్‌వర్క్ సదుపాయాలు చాలా ముఖ్యమైనవని మేం విశ్వసిస్తున్నాం." అని చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రవ్నీత్ సింగ్ ఫోకెలా చెప్పారు. దీనిని సాకారం చేస్తూ, భారతదేశంలోని 9 కొత్త మార్కెట్‌ల్లో ప్రారంభించాలని అనుకుంటున్న ఎథర్ ఎనర్జీ ఇప్పటికే 135 పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడాన్ని ఖరారు చేసింది. బెంగళూరులో 37, చెన్నైలోని 13 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లతో ఎథర్ ఎనర్జీ భారతదేశవ్యాప్తంగా మొత్తం 50 ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌లకు చేరుకుంది.
 
దీనితో దేశంలో ఎలక్ట్రిక్ వేహికల్స్ కొరకు ఒక ఎకోసిస్టమ్ రూపొదించి, సహకారం అందిస్తున్న భారతదేశంలోని కొన్ని కంపెనీల్లో ఎథర్ ఎనర్జీ ఒకటిగా నిలిచింది. భారతదేశంలో అనేక OEMలు ఎలక్ట్రిక్ వేహికల్స్ లాంఛ్ చేసినప్పటికీ, ఎథర్ పబ్లిక్ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా, వినియోగదారుల్లో ఆందోళన తగ్గించడం ద్వారా EV విప్లవం పట్ల తన నిబద్ధతను చాటుకుంటుంది. ఈథర్ గ్రిడ్‌ను అన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లు ఉపయోగించుకోవచ్చు. 10 నిమిషాల్లో 15 కిలోమీటర్ల వేగంతో ఈథర్ 450 ఎక్స్‌ను ఛార్జ్ చేయవచ్చు.
 
విఆర్ మాల్, పిపిజడ్ మాల్ మేనేజ్‌మెంట్ వంటి భాగస్వాములు, లిటిల్ లిల్లీ, బ్లూ టోకాయి, ఛాయ్ కింగ్స్, సంగీత మొబైల్స్ వంటి రిటైల్ అవుట్‌లెట్‌లు వంటి భాగస్వాములతో ఎథర్ ఎనర్జీ MOUలు కుదుర్చుకుంది. నవంబర్ 2020లో ఎథర్ 450X డెలివరీకి ముందు ఎథర్ గ్రిడ్ పాయింట్‌ల ఇన్‌స్టలేషన్ ప్రారంభం అవుతుంది.
 
హైదరాబాద్ నగరంలో ఆల్మండ్ హౌస్, శరత్ సిటీ క్యాపిటల్ మాల్, ద మూన్‌షైన్ ప్రాజెక్ట్, కేఫ్ మూన్‌షైన్, స్విస్ క్యాస్టల్, చాయ్ కహానీలలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫేజ్ 1 వేగవంతమైన విస్తరణలో భాగంగా, ఎథర్ ఎనర్జీ, తాను విస్తరించే ప్రతి కొత్త మార్కెట్‌ల్లో డెలివరీ చేయడానికి ముందుసుమారు 5-10 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది. ఈథర్ ఎనర్జీ మరింత పురోగామి హోస్ట్‌లతో పార్టనర్ కావడం కొనసాగిస్తుంది, ఇది EV యజమానులకు తేలికగా యాక్సెస్‌ని అందిస్తుంది. తద్వారా వారి ఆందోళనను నివృత్తి చేస్తుంది. భారతదేశంలో ఎలక్ట్రికల్ వాహనాల అడాప్షన్‌ని సులభతరం చేస్తుంది. 
 
ఎథర్ గ్రిడ్‌కు ఎథర్ గ్రిడ్ యాప్ మద్దతు ఇస్తుంది, ఇది EV యాజమానులు అందరూ కూడా హోమ్ స్క్రీన్‌లపై లొకేషన్‌ల లభ్యం కావడం లేదా లభ్యం కాకపోవడాన్ని నేరుగా వీక్షించవచ్చు. అప్లికేషన్‌కు ఫిల్టర్‌ మరియు 4- వాహనాలకు స్నేహపూర్వకంగా ఉండే ప్రదేశాలు, ఉచిత, పెయిడ్ పార్కింగ్ లభ్యత, లొకేషన్ టైమింగ్‌లు మరియు మరిన్నింటిపై సమాచారాన్ని అందిస్తుంది.
 
ఎథర్ ఇండియా 3030 నాటికి దేశవ్యాప్తంగా 6500 ఛార్జింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని కలిగివుంది. రవనీత్ ఫుఖేలా, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మాట్లాడుతూ... “ప్రస్తుతం మార్కెట్ కోరుకునేది ఏమిటంటే, మరిన్ని ఛార్జింగ్ మౌలికసదుపాయాలు కల్పించడం. ఎక్కువగా కనిపించడం వల్ల మానసిక ప్రశాంతత అలానే ఆందోళన కూడా తగ్గుతుంది. మేం పెట్రోల్ లేదా సిఎన్‌జి గ్యాస్ స్టేషన్ల వలే సాంద్రతను కోరుకోవడం లేదు, యాక్సెసబిలిటీ పెరగడం ఛార్జింగ్ వేగాలు పెరగాలని మేం కోరుకుంటున్నాం.
 
మా వినియోగదారులలో విశ్వాసాన్ని పెంపొందించడానికి ప్రతి నగరంలోని ప్రముఖ ప్రదేశాల్లో ఎథర్ గ్రిడ్ ఉండేలా మేం చూస్తాం. అధిక పనితీరు గల స్కూటర్‌ను మాత్రమే కాకుండా దానికి మద్దతు ఇచ్చే ఎకోసిస్టమ్‌ని రూపొందిస్తున్నటీమ్‌లో భాగం కావడం గర్వంగా ఉంది. ఇది భారీ పెట్టుబడి మరియు భారతదేశంలో EVల స్వీకరణను మెరుగుపరచడానికి ఇది అవసరమని మేం నమ్ముతున్నాం.”