శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 జూన్ 2018 (14:38 IST)

డ్రోన్ దాడిలో మలాలాను కాల్చిన ఉగ్రవాది హతం

పాకిస్థాన్ తాలిబన్ చీఫ్ మౌలానా ఫజ్లుల్లా హతమయ్యాడు. అమెరికా డ్రోన్ దాడుల్లో ఈ కరుడుగట్టిన ఉగ్రవాది చనిపోయాడు. అఫ్గానిస్థాన్‌లోని తూర్పు కునార్‌ ప్రావిన్స్‌లో అమెరికా దళాలు జరిపిన డ్రోన్‌ దాడిలో ఆయన ప్

పాకిస్థాన్ తాలిబన్ చీఫ్ మౌలానా ఫజ్లుల్లా హతమయ్యాడు. అమెరికా డ్రోన్ దాడుల్లో ఈ కరుడుగట్టిన ఉగ్రవాది చనిపోయాడు. అఫ్గానిస్థాన్‌లోని తూర్పు కునార్‌ ప్రావిన్స్‌లో అమెరికా దళాలు జరిపిన డ్రోన్‌ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు పాకిస్థాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి.
 
ఈ దాడుల్లో పాకిస్థాన్ తాలిబన్‌ అధిపతి మౌలానా ఫజ్లుల్లా, మరో నలుగురు తహ్రీక్‌ ఇ తాలిబన్‌ కమాండర్లు హతమైనట్లు ఆఫ్గాన్‌లోని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఫజ్లుల్లా, అతడి కమాండర్లు ఇఫ్తార్‌ విందులో ఉండగా ఈ దాడి జరిగినట్లు సమాచారం. 
 
ఫజ్లుల్లా 2013లో పాకిస్థాన్‌లోని తాలిబన్‌ చీఫ్‌గా నియమితులయ్యాడు. అప్పటినుంచి అమెరికా, పాకిస్థానీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులకు పాల్పడ్డాడు. 2014 డిసెంబరులో పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌పై జరిగిన ఉగ్రదాడిలో ఫజ్లుల్లా ప్రధాన సూత్రధారి. ఈ దాడిలో 151 మంది చిన్నారు ప్రాణాలు కోల్పోయారు. 
 
అలాగే, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలాపై 2012లో దాడి జరిగింది. ఈ దాడి సూత్రధారి కూడా ఫజ్లుల్లా, అతడి అనచరుడే అని అమెరికా ప్రకటించింది. దీంతో ఫజ్లుల్లాను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడిపై 5 మిలియన్‌ డాలర్ల రివార్డు ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ద్రోన్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు.