మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : మంగళవారం, 12 జూన్ 2018 (14:07 IST)

దేవసేనకు ఈ ఏడాదిలోపు పెళ్ళైపోతుందా?

బాహుబలి నటులు అనుష్క, ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలను అటు అనుష్క ఇటు ప్రభాస్ కొట్టిపారేసారు. తాము మంచి స్నేహితులమని కుండబద్ధలు చేశారు. బాహుబలి, భాగమతి తర్వాత

బాహుబలి నటులు అనుష్క, ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలను అటు అనుష్క ఇటు ప్రభాస్ కొట్టిపారేసారు. తాము మంచి స్నేహితులమని కుండబద్ధలు చేశారు. బాహుబలి, భాగమతి తర్వాత అనుష్క సినిమాలు తగ్గించుకుంది. 
 
పెళ్లి కారణంగానే అనుష్క సినిమాలు ఒప్పుకోవట్లేదని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ ప్రచారానికి బలమిచ్చేలా ఓ జాతీయ మీడియా అనుష్క పెళ్లి గురించి కథనం వెలువరించింది. ఆ కథనంలో అనుష్క ఈ ఏడాదిలోపు వివాహం జరుగనుందని పేర్కొంది. 
 
తమ కూతురు పెళ్లి కోసం చాలామంది పెళ్లికుమారుస ప్రొఫైల్స్‌ను అనుష్క తల్లిదండ్రులు చూస్తున్నారని.. ఆమెకు తగిన వరుడు దొరికినట్లైతే.. పెళ్లిపనులు ప్రారంభిస్తారని జాతీయ మీడియా పేర్కొంది. దాదాపు అనుష్క పెళ్లి ఈ ఏడాది చివరికల్లా జరుగవచ్చునని సదరు మీడియా తెలిపింది. మంచి సంబంధం ఖాయం కావాలని అనుష్క ఇటీవల హిమాలయ పర్యటనకు వెళ్లొచ్చిందని టాక్.