ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr

యుద్ధ సన్నాహాల్లో అమెరికా... కాలుదువ్వుతున్న ఉత్తర కొరియా

అమెరికా యుద్ధసన్నాహాల్లో మునిగిపోయింది. ఇప్పటికే దక్షిణకొరియా తీరాలకు అమెరికా అణ్వాయుధాలు చేరుకున్నాయి. దీనిలో భాగంగానే అమెరికాకు చెందిన అణుజలాంతర్గామి 'యుఎస్‌ఎస్‌ మిచిగన్' వారం క్రితమే దక్షిణ కొరియాల

అమెరికా యుద్ధసన్నాహాల్లో మునిగిపోయింది. ఇప్పటికే దక్షిణకొరియా తీరాలకు అమెరికా అణ్వాయుధాలు చేరుకున్నాయి. దీనిలో భాగంగానే అమెరికాకు చెందిన అణుజలాంతర్గామి 'యుఎస్‌ఎస్‌ మిచిగన్' వారం క్రితమే దక్షిణ కొరియాలోని బుసాన్‌ పోర్టుకు చేరుకుంది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా నావికా దళం అధికారిక ఫేస్‌బుక్‌ పేజ్‌లో పేర్కొంది. రష్యా అధికారిక పత్రిక స్పుత్నిక్‌ కూడా దీనిని ధ్రువీకరించింది. 
 
ఈ జలాంతర్గామి అణువార్‌ హెడ్స్‌ను దక్షిణ కొరియాకు చేర్చి ఉంటుందని వీరు భావిస్తున్నారు. సుదూర లక్ష్యాలను తాకే క్షిపణులు ఈ సబ్‌మెరైన్‌లో ఉన్నాయి. దాదాపు 18,000 టన్నుల బరువు ఉండే యుఎస్‌ఎస్‌ మిచిగాన్‌లో 154 తోమ్‌హాక్‌ క్షిపణులు ఉంటాయి. ఇవి దాదాపు 1,400 మైళ్ల దూరంలోని లక్ష్యాలను కూడా తాకగలవు. ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌ యుద్ధాల్లో అమెరికా తోమ్‌హాక్‌ క్షిపణులను వినియోగించి విజయం సాధించింది. 
 
అలాగే, అమెరికాకు చెందిన భారీ విమాన వాహక నౌక 'యుఎస్‌ఎస్‌ రోనాల్డ్‌ రీగన్' బుసాన్‌ చేరుకుంది. దీంతో అమెరికా వాయుసేన బృందాలు కూడా దక్షిణ కొరియాకు చేరినట్లైంది. సియోల్‌కు సీల్స్‌ 'యుఎస్‌ఎస్‌ మిచిగాన్'కు రహస్య ఆపరేషన్లలోనే వినియోగిస్తారని పేరుంది. దీనికి తగినట్లే అమెరికాకు చెందిన సీల్‌ కమాండోలు వినియోగించే రెండు 'సిలోస్'( అతిచిన్న సబ్‌మెరైన్‌)లను కూడా బుసాన్‌ పోర్టుకు చేర్చింది. 
 
సీల్‌ కమాండోలు సముద్రపు లోతుల్లో శత్రుస్థావరాలపై దాడులు జరిపేందుకు సిలోస్‌లను వినియోగిస్తారు. ఐక్యరాజ్యసమితిలో ఉత్తర కొరియా, అమెరికాల పరస్పర హెచ్చరికల తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. మరోవైపు ఉత్తర కొరియా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కాలుదువ్వుతోంది. దీంతో మరోమారు ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.