శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (15:59 IST)

కిమ్ పాలనలో అంతా దరిద్ర్యం.. కిమ్ సైన్యం చేతిలో నలిగిపోయాం.. నరకం అనుభవించాం..

ఉత్తర కొరియాలో మహిళలు అనుభవించే నరకాన్ని ఆ దేశం నుంచి తప్పించుకున్న మహిళ బాహ్య ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు వెల్లడించింది. కిమ్ పరివారంలోని వారంతా తమను తాము రాజులుగా భావిస్తారని హీ యోన్ లిమ్ (26) అనే

ఉత్తర కొరియాలో మహిళలు అనుభవించే నరకాన్ని ఆ దేశం నుంచి తప్పించుకున్న మహిళ బాహ్య ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు వెల్లడించింది. కిమ్ పరివారంలోని వారంతా తమను తాము రాజులుగా భావిస్తారని హీ యోన్ లిమ్ (26) అనే బాధిత మహిళ వాపోయింది. 
 
లిమ్ టీనేజ్‌లో ఉండగా.. కిమ్ సైన్యం ఆమెను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత ఆమెను సెక్స్ బానిసగా కిమ్ పరివారం ఇళ్లకు తిప్పారు. ఒకరి తర్వాత ఒకరింటికి సెక్స్ బానిసలుగా పంపుతారని... తనలాంటి ఎందరో యువతులు సెక్స్ బానిసలుగా మగ్గుతున్నారని చెప్పింది. 
 
తామంతా కిమ్ పరివారం చేతుల్లో నలిగిపోతూ.. నరకం అనుభవించామని తెలిపారు. కిమ్ పాలనలో ప్రజలంతా దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారని తెలిపింది. సెక్స్ బానిసలు నచ్చకపోయినా.. గర్భం దాల్చినా.. ఏదైనా తప్పు చేసినా వారిని కనిపించకుండా చేస్తారని వాపోయారు. పోర్నోగ్రఫీ చూశారనే కారణంతో సంగీత బృందంలోని 11మంది సభ్యులను పొలాల్లోకి ఈడ్చుకెళ్లి ఎయిర్ క్రాఫ్ట్ గన్‌లతో కాల్చిపారేశారు. 
 
అనంతరం వారి శరీరాలను ఆర్మీ యుద్ధ ట్యాంకులతో తొక్కించారన్నారు. కిమ్ జాంగ్ ఉన్‌కు విశ్వాసంగా లేరని అనిపిస్తే.. వారిని వెంటనే ఉరితీస్తారన్నారు. అతికష్టం మీద ఉత్తరకొరియా నుంచి చైనాకు.. అక్కడి నుంచి దక్షిణ కొరియా చేరుకున్నామని చెప్పింది.