సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 మార్చి 2021 (12:52 IST)

అరెరె.. జోబైడెన్ అలా మూడుసార్లు పడిపోయారే.. ఎక్కడ..? ఎప్పుడు..? (Video)

అవును మీరు చదువుతున్నది నిజమే.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కింద పడ్డారు. ఎలాగంటే..? జో బైడెన్‌ విమానం మెట్లను ఎక్కుతూ పట్టుతప్పి మూడుసార్లు జారిపడ్డారు. కొన్ని రోజులుగా అమెరికాలో ఆసియా వాసులపై వరుసగా కాల్పులు జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో ఆసియన్‌-అమెరికన్‌ కమ్యూనిటీ సభ్యులను కలవడానికి బైడెన్‌ వాషింగ్టన్‌ నుంచి అట్లాంటాకు బయలుదేరారు. ఈ క్రమంలో 78 ఏండ్ల బైడెన్‌ ఎయిర్‌ఫోర్స్‌ వన్‌ విమానం మెట్లు ఎక్కుతూ పట్టుతప్పి మూడుసార్లు జారిపడ్డారు. 
 
మొదట జారిపడ్డ బైడెన్‌.. తన కుడిచేత్తో రెయిలింగ్‌ పట్టుకుని లేచి రెండు మెట్లు ఎక్కగానే మళ్లీ జారిపోయారు. తనంతటతానుగా లేస్తుండగా... ఎడమకాలు జారడంతో మరోసారి పడిపోయారు. అనంతరం లేచి ఎడమ కాలును దులుపుకుని మొత్తానికి పైకి చేరుకున్నారు. అందరికి అభివాదం చేస్తూ విమానం లోపలికి వెళ్లారు. ప్రస్తుతం అధ్యక్షుడు బైడెన్‌ బాగానే ఉన్నారని అధికారులు ప్రకటించారు.