1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (09:46 IST)

#worldwomen'sday రాష్ట్రతి శుభాకాంక్షలు.. ఇంకా ఎంతో చేయాల్సి వుంది...

worldwomen'sday
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో మహిళల సామాజిక ఆర్థిక స్థితిగతులు మారడానికి ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. "అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. కుటుంబం, సమాజం, దేశానికి వారు స్ఫూర్తిదాయకం. భారత్లో ప్రతి రంగంలో మహిళలు తమదైన ముద్ర వేశారు. 
 
విశిష్ట పాత్రతో దేశ ప్రగతికి గణనీయమైన కృషి చేశారు. అయితే, దేశంలో మహిళల సామాజిక-ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చడానికి ఇంకా ఎంతో చేయాల్సిఉంది. వారి భద్రత, విద్య, స్వాతంత్ర్యం కోసం మనందరం అవిరామంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే అతివలు, ముఖ్యంగా మన కూతుళ్లు.. మరింత శక్తిమంతంగా, సమర్థవంతంగా తయారై, సాధికారత సాధించేందుకు వీలవుతుంది." ఈ మహిళా దినోత్సవాన్ని.. అతివల భద్రత, సాధికారత కోసం అంకితమివ్వాలని కోవింద్ పిలుపునిచ్చారు. వారి పురోగతికి ఆటంకం కలిగించే ప్రతి సంప్రదాయం, విధానాన్ని మార్చడంలో మద్దతుగా నిలుస్తామని చెప్పారు.
 
అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని కొనియాడారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని మహిళలకు గవర్నర్‌ తమిళిసై శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు మహిళా సాధికారత చాలా కీలకమన్నారు.మహిళ అభివృద్ధే కుటుంబ అభివృద్ధి అని తెలిపారు. కొవిడ్‌ సమయంలో వివిధ రంగాల్లో మహిళలు చేసిన సేవలను ఆమె కొనియాడారు.
 
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పాలనలో,అభివృద్ధిలోనూ అతివలు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. మహిళా సాధికారతే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందన్నారు. సమస్యలు ఎన్ని ఎదురైనా వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి అన్నారు. హైదరాబాద్‌ నగర మహిళలకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు.