శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 మార్చి 2022 (16:36 IST)

రష్యా-ఉక్రెయిన్ వార్.. కైవ్ ఇద్దరు పిల్లలతో సహా తల్లి మృతి (video)

kyiv
ఉక్రెయిన్‌లో రష్యన్ దాడులు జరుగుతున్న నేపథ్యంలో రాజధాని నగరం కైవ్ సమీపంలోని ఇర్బిన్ పట్టణాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించిన ఓ కుటుంబం మోర్టార్ దాడిలో ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ ఘటనలో ఒక తల్లి, ఇద్దరు పిల్లలతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని సోమవారం ఉక్రేనియన్ భద్రతా అధికారి ఒకరు తెలిపారు. రాజధాని కీవ్‌పై దాడి చేయడానికి రష్యా సిద్ధమవుతున్నట్లు ఉక్రేనియన్ అధికారులు హెచ్చరించారు.
 
ఉక్రేనియన్లు,విదేశీయులు, అందరూ ఈ యుద్ధం నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కైవ్ సమీపంలోని పట్టణం నుండి పారిపోతున్నప్పుడు తల్లి, ఇద్దరు పిల్లలు మరణించారు. 
 
ఇప్పటికే మాస్కో డిమాండ్లు నెరవేరే వరకు రష్యా సైనిక చర్య ఆగదని వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు. దీంతో భయభ్రాంతులకు గురైన వందలాది మంది ప్రజలు ఉక్రెయిన్‌ను వీడేందుకు సిద్ధంగా వున్నారు.