గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 14 మే 2019 (14:33 IST)

కుమార్తె హోంవర్క్ కాపలా కోసం కుక్కకు ట్రైనింగ్.. ఎక్కడ?

తన కుమార్తె ఇంటి పట్టున చదవకుండా, హోం వర్క్ చేయకుండా అల్లరిచిల్లరగా తిరుగుతున్నట్టు తండ్రికి అనుమానం వచ్చింది. అంతే.. వెంటనే తన పెంపుడు కుక్కల్లో ఒకదానికి ట్రైనింగ్ ఇచ్చాడు. తన కుమార్తె హోంవర్క్ చేస్తుంటే సూపర్‌వైజింగ్ చేయడమే ఆ కుక్క పని. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వార్తను పరిశీలిస్తే, చైనా రాజధాని బీజింగ్‌కు సమీపంలోని గ్విజౌ అనే ప్రాంతానికి చెందిన జు లియాంగ్ అనే వ్యక్తి తొలుత తమ ఇంట్లో తయారు చేసే ఆహార పదార్థాలు పిల్లులు, ఎలుకలు ఆరగించకుండాకాపాలా కాసేందుకు కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చి, వాటిని వంట గదిలో సెక్యూరిటీగా ఉంచాడు. 
 
కొంతకాలంకాలం తర్వాత ఆ బెడద పూర్తిగా సమసిపోయింది. ఆ పిమ్మట మరో కొత్త సమస్య ఉత్పన్నమైంది. అదేంటంటే.. తన కుమార్తె జిన్యా హోం వర్క్ చేయకుండా, సరిగా చదవకుండా పొద్దస్తమానం మొబైల్ ఫోన్‌తోనే ఆట్లాడుతున్నట్టు గ్రహించాడు. 
 
అంతే.. కుమార్తె భవిష్యత్ దృష్ట్యా హోంవర్క్ పూర్తి చేసేంతవరకు ఆ శునకం ఆమె వద్దే ఉండేలా శిక్షణ ఇచ్చాడు. అంతే ఆ పాప ఇంటికి వచ్చిన తర్వా హోం వర్క్ ప్రారంభించి, పూర్తి చేసేంతవరకు శునకరాజా ఆమె వద్దనే ఉంటుంది. దీంతో జు లియాంగ్ ఊపిరిపీల్చుకున్నాడు. తన ఆలోచన బాగానే పని చేస్తుందని చెప్పుకొచ్చాడు.