శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 5 మే 2019 (15:56 IST)

ఈ-బైకు పేలి ఐదుగురి మృత్యువాత.. 38 మందికి గాయాలు ఎక్కడ?

ఈ-బైకు పేలి ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన దక్షిణ చైనాలో జరిగింది. చార్జింగ్ పెట్టిన బైకు ఉన్నట్టుండి ఒక్కసారిగా పేలింది. దీంతో మంటలు వ్యాపించి పెద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీహదహనం కాగా, మరో 38 మంది వరకు గాయాపడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలు పరిశీలిస్తే, దక్షిణ చైనాలోని గ్యాంగ్జిజువాంగ్ గులియన్‌లో ఓ భవన సముదాయంలో ఓ వ్యక్తి నివశిస్తున్నాడు. ఈయన తన ఇంట్లో ఈ-బైకుకు చార్జింగ్ పెట్టాడు. కొద్దిసేపటి తర్వాతా షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద శబ్దంతో పేలి, మంటలు చెలరేగాయి. 
 
ఈ మంటలు ఎగిసి చుట్టుపక్కల వ్యాపించడంతో ఐదు గృహాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ గృహాల్లో చిక్కుకున్న వారిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా మరో 38 మంది గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరకుని మంటలను అదుపుచేశాయి. అనంతరం గాయపడిన వారిని అధికారులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా, చనిపోయినవారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.