సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (10:56 IST)

ఆక్టోపస్‌ను ప్రాణాలతో వున్నప్పుడే తినాలకుంది.. కానీ చుక్కలు కనిపించాయ్ (Video)

సోషల్ మీడియా ప్రభావంతో కొందరు సాహసాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా ప్రాణాలతో వున్న ఆక్టోపస్‌ను అలానే తినేందుకు ప్రయత్నించిన ఓ యువతికి చుక్కలు కనిపించాయి. ఇంతకీ ఏమైందంటే..? చైనాకు చెందిన ఓ యువతి తన ఫుడ్ బ్లాగు కోసం ప్రాణాలతో వున్న ఆక్టోపస్‌ను తినేందుకు సిద్ధమైంది. అయితే ఆక్టోపస్ ఆమె ముఖాన్ని కరిచేసింది. 
 
ఆమె ముఖ చర్మాన్ని ఆక్టోపస్ కొరకడం ప్రారంభించింది. అంతే ఆ యువతి ఆ నొప్పికి విలవిల్లాడిపోయింది. ఆక్టోపస్‌ను ప్రాణాలతో వున్నప్పుడే తినడంపై లైవ్ స్ట్రీమ్ ఇవ్వాలనుకున్న ఆ యువతి.. వీడియోకు సిద్ధమైంది. కానీ ఆ ఆక్టోపస్ మాత్రం ఆ యువతి శరీరాన్ని గట్టిగా పట్టుకుని కొరకడం మొదలెట్టింది. ఆపై నొప్పికి తాళలేక ఆ యువతి పెట్టిన కేకలు వీడియోలో రికార్డ్ అయ్యాయి. 
 
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ముఖాన్ని గట్టిగా పట్టుకున్న ఆక్టోపస్‌ను విడిపించుకునేందుకు సదరు యువతి అష్టకష్టాలు పడింది. ఈ ఘటనతో గాయపడిన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.