సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 10 మే 2019 (09:18 IST)

మద్యంమత్తులో అరాచకం : ప్రియుడిని చెట్టుకు కట్టేసి యువతిపై అత్యాచారం...

కొంతమంది యువకులు మద్యం మత్తులో ఓ యువతిపై సామాహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో బాధిత యువతి ప్రియుడిని చెట్టుకు కట్టేసి, అతని కళ్లముందే ఆ కిరాతకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మైసూరు నగరంలోని ఓ లాడ్జిలో ఓ యువతి పని చేస్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ఆ యువతి ప్రేమిస్తోంది. బుధవారం వీరిద్దరూ కలిసి నగర శివారులోని లింగాంబుధి చెరువు వద్దకు వెళ్లి, ఓ చెట్టుకింద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. 
 
ఆ సమయంలో అటుగా వచ్చిన నలుగురు యువకులు ఫుల్లుగా మద్యం సేవించివున్నారు. వీరంతా ఆ ప్రేమజంట పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వారు యువకుడిని పట్టుకుని సమీపంలోని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం యువతిపై అఘాయిత్యానికి తెగబడ్డారు. 
 
వారి నుంచి తప్పించుకున్న బాధితులు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీనిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. కామాంధుల దాడిలో గాయపడిన ప్రేమజంటను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.