గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 నవంబరు 2021 (10:46 IST)

అర్జెంటీనాలో పాప్ కార్న్ మేఘాలు.. ఏలియన్ల పనేనని..?

clouds
మొన్నటికి మొన్న తిరుమలలో మేఘాలు విభూతిని తీర్చిదిద్దినట్లు దర్శనమిచ్చాయి. తాజాగా అర్జెంటీనాలో పాప్ కార్న్ ఆకారంలో మేఘాలు కనువిందు చేశాయి. 
 
ఈ దృశ్యాన్ని చూసి అర్జెంటీనా ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈ అద్భుత మేఘాలకు సంబంధించిన దృశ్యాలు వీడియో రూపంలో బయటికి వచ్చింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. 
 
కాగా ఈ రకం మబ్బులను శాస్త్రీయ పరిభాషలో మమ్మాటస్ క్లౌడ్స్ అని పిలుస్తారు. ఈ మబ్బులను చూసి కొందరు ఆందోళనకు గురయ్యారట. ఆ సమయంలో ఈదురుగాలులు కూడా వీస్తుండడంతో ఇదేమైనా ప్రకృతి వైపరీత్యమేమో అని భయపడ్డారట.
 
ఇక దీనికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు ఇది వాతావరణ మార్పుగా భావించగా, మరికొందరు ఇవి భూమికి సంబంధించిన మేఘాలు కావని, ఏలియన్ల పనే అని అనుమానించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.