శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 13 మార్చి 2019 (21:46 IST)

చెట్లను పెళ్ళి చేసుకుంటున్న మహిళలు... ఎందుకు?

గత కొద్దిరోజులుగా మెక్సికోకు చెందిన మహిళలు చెట్లను పెళ్ళి చేసుకుంటూ ఉన్నారట. అలాగే మగవాళ్ళు లేరని కాదు. తాము పెళ్ళి చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో కూడా అప్‌లోడ్ చేస్తూ వస్తున్నారట. ఒకరి తరువాత ఒకరు ఇలా చాలామంది మహిళలు చెట్లను పెళ్ళి చేసుకుంటూ ఉన్నారట. అయితే దీనికి ఒకే కారణం.. వారికి చెట్ల మీద ఉన్న ప్రేమేనట. 
 
శ్యామ్ జగింటో అమిల్ పాస్ రాష్ట్రంలో ఇప్పటికే చాలాచోట్ల చెట్లను నరికేశారట. ఇక మిగిలిన చెట్లను కూడా ఎక్కడ నరికేస్తారోనని భావించిన ఒక స్వచ్చంధ సంస్ధ చెట్టుని పెళ్ళి చేసుకో అన్న పోగ్రామ్‌ను మొదలుపెట్టిందట. దీనికి స్పందించిన మహిళలు వారు చెప్పినట్లే చేస్తున్నారట. పర్యావరణాన్ని కాపాడేందుకు కోసం వారు ఈ పనిచేస్తున్నారట. 
 
మొదట మహిళలు ఇలా పెళ్ళి చేసుకోవడం మొదలుపెట్టారట. అది చూసిన కొంతమంది మగవాళ్ళు కూడా చెట్లను తమ భార్యలుగా స్వీకరిస్తున్నారు. ఏది చేసినా చెట్లను కాపాడుకోవడానికేనని స్వచ్ఛంధ సంస్ధల సభ్యులు చెబుతున్నారు.