శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 9 మార్చి 2019 (15:59 IST)

ఇంగ్లండ్‌తో మూడో టీ-20.. కేవలం ఒక్క పరుగు తేడాతో భారత్ ఓటమి

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మహిళల జట్టు ఒక్క పరుగు తేడాతో గెలుపును నమోదు చేసుకుంది.


గౌహతిలోని బర్సపర క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ చివరి వరకు పోరాడింది. తొలుత  బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 119 పరుగులు సాధించింది.
 
ఇంగ్లండ్ జట్టులో టామీ 29 పరుగులు, ఎల్లెన్ జాన్స్ 26 పరుగులు, డానియల్ వ్యాట్ 24 పరుగులు సాధించారు. ఇక భారత మహిళల బౌలర్లలో  అంజున పటేల్, హర్లిన్ డియోల్‌లు రెండు చొప్పున, ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్‌లు చెరో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. 
 
తదనంతరం 120 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల పతనానికి 119 పరుగులు సాధించింది. అయినా ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. భారత మహిళా జట్టులో స్మృతిమందన 58 పరుగులతో అర్థ సెంచరీ సాధించినా, మిథాలిరాజ్ 30 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది.