సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 20 ఆగస్టు 2018 (11:52 IST)

పాండ్యా పరాక్రమం.. నాటింగ్‌హామ్ టెస్టుపై భారత్ పట్టు

భారత బౌలర్ హార్దిక్ పాండ్యా పరాక్రమం చూపడంతో నాటింగ్ హామ్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పట్టుబిగించారు. ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ అయింది.

భారత బౌలర్ హార్దిక్ పాండ్యా పరాక్రమం చూపడంతో నాటింగ్ హామ్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పట్టుబిగించారు. ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 161 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ పాండ్యా కీలక వికెట్లను తీయడంతో ఇంగ్లండ్ తక్కువ స్కోరు చేయగలిగింది.
 
ఇంగ్లండ్ ఆటగాళ్లు జోస్ బట్లర్ 39, కుక్ 29, కీటన్ జెన్నింగ్స్ 20 పరుగులు చేయగా.. భారత్ బౌలర్లు హార్దిక్ పాండ్య 5, ఇషాంత్ శర్మ, బూమ్రా చెరో 2 వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేయడంతో భారత్ 168 పరుగుల ఆధిక్యంలో ఉంది. లంచ్ సమయానికి వికెట్ నష్టపోకుండా 46 రన్స్ ఉన్న ఇంగ్లండ్.. టీ బ్రేక్‌కు 38.2 ఓవర్లలో ఆలౌట్ అయింది.  
 
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన భారత్ ఆట ముగిసే సమయానికి 31 ఓవర్లలో 2 వికెట్లకు 124 పరుగులు చేసింది. కోహ్లీ (8 బ్యాటింగ్), పుజార (33 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ధవన్ (44), రాహుల్ (36) తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించారు. ఓవరాల్‌గా విరాట్‌సేన 292 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.