శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 12 ఆగస్టు 2018 (16:58 IST)

ఇంగ్లాండ్ సూపర్ ఇన్నింగ్స్.. 396/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌

ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌, ఇంగ్లాండ్‌ 396/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. భారత్‌పై 289 పరుగుల ఆధిక్యం సాధ

ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. క్రికెట్ మక్కా లార్డ్స్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌, ఇంగ్లాండ్‌ 396/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. భారత్‌పై 289 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆల్‌రౌండర్‌ క్రిస్ వోక్స్‌ (137 నాటౌట్‌; 177 బంతుల్లో 21 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. నాలుగో రోజు, ఆదివారం ఓవర్‌నైట్‌ స్కోరు 357/6తో బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లాండ్ నిలకడగా ఆడింది. 
 
అంతకుముందు రోజు స్కోరుకు అదనంగా 39 పరుగులు జోడించింది. ఆధిక్యాన్ని 289కి పెంచుకుంది. ఆదివారం నుంచి క్రిస్‌వోక్స్‌ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఆల్ రౌండర్.. శామ్ కరన్.. 40 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలో వేగంగా ఆడుతూ హార్దిక్‌ పాండ్య వేసిన 88.1వ బంతికి భారీ షాట్‌ ఆడబోయి ఫీల్డర్‌ షమికి చిక్కాడు. దాంతో జోరూట్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు.