సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 12 ఆగస్టు 2018 (11:43 IST)

బీసీసీఐ చీఫ్‌గా సౌరవ్ గంగూలీ.. రెండేళ్ల పాటు ఆ పదవిలో?

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్వరలోనే బీసీసీఐ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన గంగూలీ.. ప్రస్తుతం క్రిక

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్వరలోనే బీసీసీఐ పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన గంగూలీ.. ప్రస్తుతం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడిగా వున్నాడు. త్వరలోనే గంగూలీ బీసీసీఐ పగ్గాలు చేపట్టవచ్చునని క్రికెట్ వర్గాల సమాచారం. 
 
బీసీసీఐ కొత్త రాజ్యాంగంలో కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌‌ను సవరించడం, దానికి సుప్రీంకోర్టు ఆమోదం పలికిన నేపథ్యంలో ప్రస్తుత, మాజీ అడ్మినిస్ట్రేటర్లు అందరూ అధ్యక్ష పదవికి అనర్హులు అయ్యారు.

ఈ నేపథ్యంలో, కొత్త వ్యక్తి రాక అనివార్యం కావడంతో, పలువురు మాజీ క్రికెటర్లకు ఛాన్స్‌ ఉన్నప్పటికీ, క్రికెట్ రాజకీయాల్లో ఆరితేరిన గంగూలీకి మిగతావారితో పోలిస్తే మరిన్ని అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వస్తోంది. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడైతే రెండేళ్ల పాటు ఆ పదవిలో వుంటాడని టాక్.