శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 మార్చి 2017 (21:56 IST)

చెన్నైలో మరో 100 పాథాలజీ ల్యాబ్‌లు... లిస్టర్ మెట్రోపొలిస్

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో మరో వంద పాథాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ లిస్టర్ మెట్రోపొలిస్ ప్రకటించింది. ఈ వంద ల్యాబ్‌లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ విడుదల చేసి

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో మరో వంద పాథాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్టు మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ లిస్టర్ మెట్రోపొలిస్ ప్రకటించింది. ఈ వంద ల్యాబ్‌లను వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.
 
ఇందుకోసం గ్లోబెల్ చైన్ పాథాలజీ ల్యాబ్ వచ్చే ఏడాది నాటికి భారీ విస్తరణ కోసం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న కేంద్రాలే కాకుండా కొత్తగా వంద సెంటర్లను ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం చెన్నై నగరంలో వందకు పైగా పరిశోధనాశాలలు ఉన్నాయి. ఇవేకాకుండా వచ్చే ఆర్థిక ఏడాది వంద నుంచి 150 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు లిస్టర్ మెట్రోపొలిస్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా సూర్యనారాయణన్ పేర్కొన్నారు. 
 
అలాగే, చెన్నై నగరంలో తమ ల్యాబ్స్ ద్వారా సేవలు ప్రారంభించి 32 ఏళ్లు పూర్తైనట్లు లిస్టర్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అజిత్ వేదా చెప్పారు. మెట్రోపొలిస్ హెల్త్ కేర్ లిమిటెడ్ ఒక్క భారత్‌లోనే కాకుండా.. సౌత్ ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల్లోనూ సేవలు అందిస్తున్న విషయాన్ని అజిత్ వేదా గుర్తు చేశారు. 
 
ప్రస్తుతం చెన్నై నగర వ్యాప్తంగా ప్రస్తుతం మూడో లేబోరేటరీలతో పాటు 100 కలెక్షన్ సెంటర్లను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వడంలో తాము ముందున్నామని... నగరంలో ఎస్ఏబీఎల్ గుర్తింపు పొందిన పరిశోధకశాల్లో తమది ఒకటన్నారు.