శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (12:15 IST)

అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం: 42 మంది మృతి

ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కబైలియా రీజియన్‌లోని కొన్ని ప్రాంతాల్లో పలు దఫాలుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 42 మంది మృతిచెందారు.
 
వీరిలో 25 మంది సైనికులతో పాటు 17 మంది సాధారణ పౌరులు ఉన్నారు. మంటల నుంచి సుమారు వంద మందికి పైగా ప్రజలను సైనికులు రక్షించారు. మంటలను అదుపు చేసే క్రమంలో సైనికులు సైతం మృత్యువాత పడ్డారు.