శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 14 అక్టోబరు 2016 (10:06 IST)

'ఎస్కలేటర్ ఎక్కుతున్నావా'... మరో పదేళ్లు ఆమెతో డేటింగ్ చేస్తా : డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 1992లో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్ కార్యక్రమం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్‌కు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. 1992లో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్ కార్యక్రమంలో పాల్గొన్న ఓ యువతిని అక్కడున్న రియాల్టీ టీవీ స్టార్... 'ఎస్కలేటర్ ఎక్కుతున్నావా' అని అడగ్గా, ఆమె అవునని చెబుతుంది. అప్పుడు ట్రంప్ కెమెరా వైపు తిరిగి, ''మరో పదేళ్లలో నేను ఆమెతో డేటింగ్ చేస్తాను. మీరు నన్ను నమ్మగలరా?'' అని అడుగుతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
మరోవైపు.. 2005లో నాటి మహిళల గురించి ఆయన చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలతో ఒక రకంగా రిపబ్లికన్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. అంతలోనే తాజాగా సీబీఎస్ న్యూస్ సంస్థ మరో వీడియోను సంపాదించి ప్రసారం చేసింది. ఇందులో అప్పటికి 46 ఏళ్ల వయసున్న డోనాల్డ్ ట్రంప్.. ఓ యువతిని ఉద్దేశించి పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంటే చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు ట్రంప్ ఎవరినీ వదల్లేదన్న విషయం తాజా వీడియోలతో వెలుగులోకి వచ్చింది.