శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2017 (16:44 IST)

చైనాలో రక్తనదులు పారిస్తాం- ఐసిస్ స్ట్రాంగ్ వార్నింగ్.. నెట్లో 30 నిమిషాల వీడియో

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఐస్ ఉగ్రమూకల నుంచి చైనాకు ''రక్తనదులు పారిస్తాం'' అనే హెచ్చరికలు వచ్చాయి. చైనాలోని ఉఘుర్ తెగకు చెందిన ముస్లింలు కొందరు సిరియాలోని ఐఎస్ శిబిరాల్లో శిక్షణ పొందారని.. తాము కలీ

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఐస్ ఉగ్రమూకల నుంచి చైనాకు ''రక్తనదులు పారిస్తాం'' అనే హెచ్చరికలు వచ్చాయి.
చైనాలోని ఉఘుర్ తెగకు చెందిన ముస్లింలు కొందరు సిరియాలోని ఐఎస్ శిబిరాల్లో శిక్షణ పొందారని.. తాము కలీఫా సిపాయిలం వస్తున్నాం అంటూ హెచ్చరించారు. మీకు మా భాష అర్థం కాకపోవచ్చు. అందుకే ఆయుధాల భాషలోనే అర్థం చేయిస్తామని ఐఎస్ హెచ్చరించింది. 
 
ఇంకా తమపై జరిపిన అకృత్యాలకు, పాల్పడిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాం.. చైనా గడ్డపై నెత్తురు నదుల్లా పారుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన 30 నిమిషాల వీడియో కూడా నెట్లో హల్ చల్ చేస్తోంది. 
 
ఇకపోతే.. ఉగ్రవాదం పట్ల పట్టించుకోకుండా.. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రయత్నాలకు అడ్డుపడుతున్న డ్రాగన్ దేశానికి ఐస్ నుంచి హెచ్చరికలు రావడంతో మొచ్చమటలు పట్టడం ఖాయమని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.