శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 మార్చి 2017 (17:04 IST)

అంటార్కిటిక్ ద్వీపకల్పంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత.. లోతట్టు ప్రాంతాలు మునిగిపోతాయట..!

పెరుగుతున్న జనాభా, వాతావరణ కాలుష్యం, ఓజోన్ పొర హోల్స్ వంటి కారణాలతో ప్రకృతీ వైపరీత్యాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మానవ తప్పిదాలతో ప్రకృతీ వైపరీత్యాలను కొనితెచ్చుకోక తప్పదవి వారు హెచ్చర

పెరుగుతున్న జనాభా, వాతావరణ కాలుష్యం, ఓజోన్ పొర హోల్స్ వంటి కారణాలతో ప్రకృతీ వైపరీత్యాలు తప్పవని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మానవ తప్పిదాలతో ప్రకృతీ వైపరీత్యాలను కొనితెచ్చుకోక తప్పదవి వారు హెచ్చరిస్తున్నారు. తాజాగా ధ్రువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం ద్వారా మంచు కరిగే ప్రమాదం ఉందని.. దాంతో పలుదేశాల్లో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం పొంచి వుందని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తున్నారు. 
 
ధ్రువ ప్రాంతాల్లోని వాతావరణం క్రమ క్రమంగా విపరీత ఉష్ణోగ్రతలకు లోనుకావడంతో పాటు భవిష్యత్తులో ఇది పెను దుష్ఫలితాలకు దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర అంటార్కిటిక్ ద్వీపకల్పంలోని అర్జెంటీనా రీసర్చ్ సెంటర్ 'ఎస్పరాంజా' బేస్ వద్ద రికార్డు స్థాయిలో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా ప్రపంచ వాతావరణ సంస్థ నిపుణులు వెల్లడించారు.
 
1982 జనవరిలో 15డిగ్రీల ఉష్ణోగ్రత కావడమే ఇప్పటిదాకా అత్యధిక రికార్డుగా కొనసాగుతూ వస్తోంది. తాజాగా ఉష్ణోగ్రతలు 17.5కు చేరడంతో పాత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ధ్రువాల వద్ద ఇంతలా ఉష్ణోగ్రతలు ఎందుకు పెరుగుతున్నాయో అంతుచిక్కక పరిశోధకులు కలవరపడుతున్నారు. దీంతో మంచు కరిగి.. లోతట్టు ప్రాంతాలు నీట మునిగే ప్రమాదముందని వారు హెచ్చరిస్తున్నారు.