శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (14:04 IST)

పూర్తిగా వాడేసుకున్నాడు.. పెళ్లి మాటెత్తగానే ఉలిక్కిపడ్డాడు... ప్రియురాలు కత్తిపీటతో ఏం చేసిందో తెలుసా?

తనను అన్ని విధాలుగా వాడుకుని, చివరకు పెళ్లి మాటెత్తగానే పారిపోయేందుకు ప్రయత్నించిన ప్రియుడిని అతని ప్రియురాలు వంటిట్లో కూరగాయలు కోసే కత్తిపీటతో పొడిచి పొడిచి చంపేసింది. ఈ దారుణం దుబాయ్‌లో జరుగగా, తాజా

తనను అన్ని విధాలుగా వాడుకుని, చివరకు పెళ్లి మాటెత్తగానే పారిపోయేందుకు ప్రయత్నించిన ప్రియుడిని అతని ప్రియురాలు వంటిట్లో కూరగాయలు కోసే కత్తిపీటతో పొడిచి పొడిచి చంపేసింది. ఈ దారుణం దుబాయ్‌లో జరుగగా, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
రష్యా దేశానికి చెందిన 35 యేళ్ల అవివాహిత ఓ పారిశ్రామికవేత్త. దుబాయ్‌లో నివశిస్తోంది. ఈమె పాలస్తీనా దేశానికి ఓ వ్యక్తిని ప్రేమిచింది. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ క్రమంలో ప్రేమికుడు ఇష్టపడిందే కాదు.. అడిగిందల్లా కొనిచ్చింది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించింది. వీరిద్దరి ప్రేమ వ్యవహారం బయటకు పొక్కడంతో ఇరుగుపొరుగువారు ఆ యువతి గురించి చెడుగా మాట్లాడటం ప్రారంభించారు. దీంతో పెళ్లి చేసుకుందామని ప్రతిపాదన తెచ్చింది. 
 
అప్పటిదాకా అన్నీ చక్కగా సాగిపోయిన ప్రియుడికి.. ప్రియురాలి ప్రతిపాదన విని ఉలిక్కి పడ్డాడు. పెళ్లి ప్రస్తావన తన వద్ద తేవద్దని మాట దాటవేశాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ప్రియురాలు.. అతడి గురించి వివరాలను కూపీ లాగింది. మొత్తానికి అతడికి అంతకుముందే పెళ్లయిందని తెలుసుకుంది. ఈ విషయమై ఓ రోజు తన ఫ్లాట్‌కు వచ్చిన ప్రియుడిని నిలదీసింది. ఇద్దరి మధ్య గొడవయింది. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం అయిన తర్వాత కారులో బయటికెళ్లి బార్‌కెళ్లి మద్యం తెచ్చుకుని పీకల వరకు మద్యం సేవించారు. 
 
మద్యం మత్తులో ఉన్న ప్రియుడిపై ప్రియురాలు వంటింట్లో వాడే కత్తిపీటతో దాడిచేసింది. గుండెల్లో పొడిచి చంపేసింది. ఆ తర్వాత పక్కనే ఉన్న బెడ్‌పై ప్రశాంతంగా నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం నిద్రలేచి తాపీగా పోలీసులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పేసింది. విషయం తెలుసుకున్న దుబాయి పోలీసులు హుటాహుటిన ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమెకు 15 యేళ్ల జైలుశిక్ష విధిస్తూ దుబాయ్ కోర్టు తీర్పునిచ్చింది.