సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 29 మార్చి 2019 (16:12 IST)

బార్ చూడగానే నాలుక పీకింది... పసిపిల్లలను కారులో లాక్ చేసి వెళ్లిన తల్లి... ఆ తర్వాత?

తాగుబోతులు ఎలా వుంటారని అడిగితే... ద్యావుడా... నా ప్రాణాన్నైనా తీసుకెళ్లు కానీ నాకు మాత్రం ఎల్లవేళలా మందు బాటిల్ లేకుండా చేయకు అని అంటారట. ఉదయాన్నే లేవగానే మద్యానికి బానిసైనవారు నేరుగా వెళ్లేది బార్ కి తప్ప మరోచోటికి వెళ్లరు.. వెళ్లలేరు. ఇలా తాగుడుకి బానిసలైనవారు ఎంతటి అఘాయిత్యం చేయడానికైనా, ఏమాత్రం బిడియం లేకుండా హ్యాపీగా తాగేస్తుంటారు. 
 
ఇక అసలు విషయానికి వస్తే... అమెరికాలోని ఫ్లోరిడాలో తాగుడికి బానిసైన ఓ మహిళ తన ఐదుగురు కన్నబిడ్డలను కారులో పెట్టి లాక్ చేసి మందు కొట్టడానికి వెళ్లింది. బార్ లోకి వెళ్లిన తర్వాత వళ్లు తెలియకుండా పూటుగా మద్యం సేవించింది. పీకల వరకూ తాగేసే మత్తుగా బార్లో ఎంజాయ్ చేస్తోంది. కానీ బయట కారు లోపల చిన్నారులు గాలి ఆడక ఇబ్బందిపడుతున్నారు. 
 
ఈ స్థితిలో భర్త ఇంటికెళ్లి చూడగా తన భార్యాపిల్లలు కనిపించలేదు. దీనితో అనుమానం వచ్చిన అతడు ఫోన్ చేశాడు. ఎంతకీ ఫోన్ తీయలేదు. చివరికి ఐదేళ్ల పెద్దకుమార్తె ఫోన్ తీసి తాము కారులో వున్నామని చెప్పింది. అమ్మ ఎక్కడుంది అని అడిగితే... బార్ లోపలికి వెళ్లిందని ఆ పసి బాలిక చెప్పింది. దీనితో అనుమానం వచ్చిన అతడు భార్యాపిల్లల్ని వెతుక్కుంటూ వచ్చాడు. 
 
ఓ బార్ ఎదురుగా పిల్లలున్న కారు ఆగి వుండటాన్ని గమనించి అక్కడికెళ్లి కారు డోర్లు తీయబోయాడు. కానీ అవి తెరుచుకోలేదు. దీనితో కారు తాళాల కోసం రెస్టారెంట్లో భార్య వద్దకు వెళ్లగా ఆమె పూటుగా మద్యం సేవించి వళ్లు తెలియకుండా పడిపోయి వుంది. ఎంత వెతికినా తాళాలు కనిపించలేదు. దీనితో వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి కారు తలుపులు తెరిచి పిల్లలను రక్షించారు. కాగా పిల్లలను అలా రోడ్డుపై కారులో వదిలేయడమే కాకుండా మద్యం మత్తులో జోగిన భార్యపై ఫిర్యాదు చేశాడు భర్త.