శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2019 (12:50 IST)

వారిలో నమ్మకం రావాలంటే.. ఏం చేయాలి..?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పడి కుటుంబానికి సరిపడా సమయాన్ని కేటాయిస్తున్నారా అనే విషయానికి వస్తే.. లేదనే చెప్పాలి. ఇలా చేయడం వలన కుటుంబసభ్యులు ముఖ్యంగా పిల్లలు చాలా బాధపడుతారు. వారి ఆలోచనలు కూడా పలువిధాలుగా ఉంటాయి.. అంటే.. మా అమ్మనాన్నలు మాతో ఉండడం లేదని ఆలోచనే వారిలో ఎక్కువగా ఉంటుంది. 
 
కనుక ఇక నుంచయినా ఆ పనిచేయడం మంచిది. కుటుంబసభ్యులతో వీలైనంత ఎక్కువ సమయం కేటాయించగలిగితే వారిని దృఢంగా మార్చినవారవుతారు. అలానే చిన్నారులతో ఎలా గడపాలంటే..
 
వారంలో ఒక్కరోజు మాత్రం పిల్లలకోసమే కేటాయించాలి. ఆ రోజు వారిని బయటకు తీసుకెళ్లాలి. ఇష్టమైన ఆటలు ఆడాలి వారితో కూడా ఆడించాలి. దీన్ని ఎంత ఎక్కువగా కొనసాగిస్తే.. అంత మంచిది. అలానే ఏడాదికోసారి ఏదైనా విహారయాత్రకు వెళ్లేలా చూసుకుంటే.. పిల్లలకు ఆనందమే కాదు.. కొత్త ప్రాంతాలకు సంబంధించిన విషయ పరిజ్ఞానం అందించినవారవుతారు.
 
వంటింట్లో పనిచేస్తున్నా సరే.. పిల్లల్నీ అందులో భాగస్వామ్యం చేయాలి. ఆ సమయంలో కబుర్లు చెబుతూ కలిసి పనిచేయాలి. ఇలా చేయడం వలన వారికి సరదాగా అనిపించడమే కాదు.. మీరు వాళ్లకు ప్రాధాన్యం ఇస్తారనే నమ్మకం వారిలో కలుగుతుంది. అది వారికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.