శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 12 జులై 2017 (10:03 IST)

విమానంలో మహిళపై-మహిళ లైంగిక వేధింపులు.. పెదాలను తడిమింది.. అభ్యంతరకరంగా?

విమానంలో ఇటీవల ఓ మహిళపై లైంగిక వేధింపులు పాల్పడిన ఘటన గురించి తెలిసిందే. అయితే సీన్ రివర్సైంది. విమానంలో సాటి మహిళపై మరో మహిళ లైంగిక వేధింపులకు పాల్పడింది. దీంతో ఆ మహిళకు న్యాయస్థానం ఎనిమిది నెలల గృహ

విమానంలో ఇటీవల ఓ మహిళపై లైంగిక వేధింపులు పాల్పడిన ఘటన గురించి తెలిసిందే. అయితే సీన్ రివర్సైంది. విమానంలో సాటి మహిళపై మరో మహిళ లైంగిక వేధింపులకు పాల్పడింది. దీంతో ఆ మహిళకు న్యాయస్థానం ఎనిమిది నెలల గృహ నిర్భంధం విధించింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని లాస్ వెగాస్ నుంచి పోర్ట్‌ల్యాండ్ వెళ్తున్న విమానంలో ఓరెగాన్‌కు చెందిన హీడీ మెక్‌కిన్నీ (27) తన పక్క సీట్లోని మహిళతో అసభ్యంగా ప్రవర్తించింది. ఆమెను అభ్యంతరకరమైన రీతిలో తాకింది. 
 
పెదాలతో తడిమింది. ఆమె ప్రవర్తనపై 19 ఏళ్ల బాధితురాలు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీంతో పోర్ట్‌ల్యాండ్‌లో విమానం ల్యాండ్ కాగానే అధికారులు కిన్నీని అరెస్ట్ చేశారు. ఈ ఘటన మే 8.. 2016లో చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిని కోర్టు దోషిగా తేల్చింది. కిన్నీకి 8 నెలల పాటు గృహ నిర్భంధం విధించింది. ఇంకా కిన్నీపై మూడేళ్ల పాటు ప్రొబేషన్ విధించారు. కిన్నీ ప్రవర్తనతో షాక్ తిన్నానని.. బాధిత మహిళ తెలిపింది.