ఆదివారం, 19 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 7 జులై 2024 (14:20 IST)

ప్రపంచ చాక్లెట్ దినోత్సవం.. డార్క్ చాక్లెట్ తింటే మేలే.. కానీ ఎక్కువగా తీసుకుంటే?

Chocolate to Delight
నేడు ప్రపంచ చాక్లెట్ దినోత్సవం. ఈ రోజు చాక్లెట్ ప్రియులు జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు తమకు ఇష్టమైన చాక్లెట్లను తినడం చేస్తారు. ఈ ప్రపంచ చాక్లెట్ దినోత్సవం.. తొలిసారి యూరప్‌లో 1550లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి జూలై 7 చాక్లెట్ డేగా జరుపుకుంటున్నారు. ఈ డే జరుపుకున్న తర్వాత అనేక మార్పులు వచ్చాయి. వివిధ రకాల ఫ్లేవర్ చాక్లెట్స్ మార్కెట్లోకి వచ్చేశాయి. 
 
ఈ చాక్లెట్లను తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అదేంటంటే.. డార్క్ చాక్లెట్లు శరీరంలోని రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. రక్తపోటును నుంచి కాపాడుతుంది. మెదడు నుంచి గుండెకు రక్తాన్నీ సాఫాగా సాగేలా చూస్తుంది. డార్క్ చాక్లెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. డార్క్ చాక్లెట్లలో ముఖ్యంగా ఐరన్, కాపర్ పుష్కలంగా వుంటాయి. 
 
అయితే చాక్లెట్లను మితంగా తీసుకోవాలి. అతిగా తింటే ఊబకాయం తప్పదు. పిల్లలు అధికంగా తీసుకుంటే దంతాలు పుచ్చిపోయే ప్రమాదం వుంది. ఒకవేళ తింటే బ్రష్ చేసుకోవాలి.