బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జులై 2024 (08:58 IST)

5079 నాటికి ప్రపంచం అంతమైపోతుంది : అంధ కాలజ్ఞాని బాబా వంగా!!

baba vanga
కాలజ్ఞానిగా ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపు పొందిన బల్గేరియాకు చెందిన అంధ కాలజ్ఞాని బాగా వంగా ప్రతి ఒక్కరూ నివ్వెరపోయే చెప్పిన జోస్యం తాజాగా వెలుగులోకి వచ్చింది. వచ్చే 5079 సంవత్సరంనాటికి ఈ ప్రపంచం అంతమైపోతుందని జోస్యం చెప్పింది. ఈ మహిళ అంధ బాబా వంగాకు ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన గుర్తింపు వుంది. ముఖ్యంగా, రానున్న దశాబ్దాలు, శతాబ్దాల కాలంలో ఏం జరగబోతున్నాయో గతంలో వెల్లడించింది. ఇవి తాజాగా వెలుగులోకి వచ్చాయి. వీటిలో కొన్ని నిజం కాగా, మరికొన్ని జరగలేదు. అలాగే, రానున్న దశాబ్దాలు, శతాబ్దాల్లో జరగబోయే కొన్ని జోస్యాలను ఆమె చెప్పారు. వాటిని పరిశీలిస్తే, 
 
వచ్చే 2025లో యూరప్ దేశంలో ఒక పెద్ద వివాదం చెలరేగుతుంది. దీని కారణంగా ఈ ఖండంలో జనాభా గణనీయంగా తగ్గుతుందని చెప్పరు. 2028లో కొత్త ఇంధన వనరుల అన్వేషణలో మనుషులు శుక్ర గ్రహానికి వెళ్తారని, 2033లో భూమి ధ్రువాల్లో మంచు కరగడంతో సముద్ర మట్టాలు గణనీయంగా పెరిగిపోతాయని చెప్పారు. 2076లో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం తిరిగి మరింతగా బలోపేతం అవుతుందని చెప్పారు. 
 
2130లో గ్రహాంతర జీవులతో భూమికి సంబంధం ఏర్పడుతుందని, 2170లో ప్రపంచవ్యాప్తంగా కరువు తాండవిస్తుందని చెప్పారు. 3005 లోకుజ గ్రహంపై యుద్ధం జరుగుతుందని, 3797లో భూమి నాశనం అవుతుంది. అయితే సౌర వ్యవస్థలోని మరొక గ్రహానికి వెళ్లగలిగే సామర్థ్యాన్ని మానవులు సమకూర్చుకుంటారని తెలిపారు. 5079 నాటికి ఈ ప్రపంచం అంతమైపోతుందిని బాబా వంగా జోస్యం చెప్పారు. 
 
కాగా, బాబా వంగా అసలు పేరు వాంజెలియా పాండేవా గుషెరోవా. 12 సంవత్సరాల వయసులోనే చూపుని కోల్పోయారు. 85 ఏళ్ల వయస్సులో 1996లో ఆమె మరణించాడు. చూపులేకపోయినప్పటికీ ఆమె చెప్పిన జోస్యాల్లో చాలా నిజమయ్యాయి. ముఖ్యంగా అమెరికాను గజగజలాడించిన 9/11 ఉగ్రవాద దాడులు అక్షరాలా నిజమయ్యాయని చెబుతుంటారు. 
 
'రెండు లోహపు పక్షులు అమెరికన్ సోదరులపైకి దూసుకెళ్తాయి. పొదల చాటు నుంచి తోడేళ్లు అరుస్తాయి. అమాయకుల రక్తం నదులలో పారుతుంది' అని ఆమె ఊహించి చెప్పారు. అమెరికాలో జరిగిన ట్విన్ టవర్ల దాడి దీనికి దగ్గరగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక బ్రిటన్ యువరాణి డయానా మరణం, బ్రెగ్జిట్‌తో పాటు మరికొన్ని ఘటనలు ఆమె జోస్యాల ప్రకారమే జరిగాయని విశ్వసిస్తుంటారు. అందుకే ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది.