మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జులై 2024 (14:48 IST)

బడలిక కారణంగా సరిగ్గా చర్చించలేక పోయా : జో బైడెన్

joe biden
అమెరికా అధ్యక్ష పీఠానికి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌లు పోటీపడుతున్నారు. అయితే, రిపబ్లికన్ నేత డోనాల్డ్ ట్రంప్‌తో జరిగిన టీవీ చర్చలో తాను తడబడటం, విఫలమవడంపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఈ పరిస్థితికి తానే కారణమని, వైఫల్యానికి పూర్తి బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. అంతకుముందు, విస్కాన్సిన్‌లోని మాడిసన్ నగరంలో జరిగిన డెమాక్రటిక్ పార్టీ ర్యాలీలో బైడెన్ పాల్గొన్నారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆ రాత్రి టీవీ చర్చలో తాను విఫలమయ్యాయని చెప్పారు. దీనికి కారణం తీవ్రమైన అనారోగ్య కారణమేమీ లేదన్నారు. అప్పటికే బాగా అలసిపోయినా, మనసు మొరాయిస్తున్నా వినకుండా చర్చలో పాల్గొని విఫలమయ్యానని చెప్పారు. ట్రంప్‌తో చర్చకు ముందు ఫ్రాన్స్ పర్యటన నుంచి వచ్చిన బైడెన్ క్యాంప్ డేవిడ్ రెస్టు తీసుకున్న విషయాన్ని యాంకర్ ప్రస్తావించారు. 
 
ఈ విశ్రాంతి సరిపోలేదా అని ప్రశ్నించారు. అప్పటికే తాను బాగా బడలికతో ఉన్నానని, అసలే మాత్రం ఉత్సాహంగా లేనని బైడెన్ చెప్పుకొచ్చారు. వైద్య పరీక్షల్లో కొవిడ్ వ్యాధి లేదని వచ్చినా తీవ్రమైన జలుబు మాత్రం ఉందని చెప్పారు. చర్చకు సంబంధించి టీవీ ఫుటేజీని తాను ఇప్పటివరకూ చూడలేదని కూడా బైడెన్ చెప్పారు. కానీ, అది నిరాశపరిచేదిగా ఉందన్న విషయం తనకు తెలుసని అన్నారు.