మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (16:38 IST)

శరీరానికి చర్మం లేకుండానే శిశువు జననం

హైదరాబాద్ నగరంలో రెండు తలల మగశిశువు జన్మించాడు. ఆ తర్వాత చనిపోయాడు. అలాగే, మరో శిశువు శరీరంపై చర్మం లేకుండా జన్మించాడు. ఈ శిశువు అమెరికాలోని ఓ ఆస్పత్రిలో జన్మించాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శాన్ ఆంటోనియోలో నివసించే ప్రిస్కిల్లా మాల్డొనాడో అనే మహిళ నిండు గర్భిణి. ఈమెకు పురిటి నొప్పులు రావడంతో టెక్సాస్‌లోని మెథడిస్ట్ హాస్పిటల్‌లో చేర్పించారు. 
 
ఈమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ ఆనందం ఎక్కువ సేపు మిగల్లేదు. ఆ చిన్నారి శరీరంపై అనేక కీలకభాగాలపై చర్మం లేకుండా ఉండటాన్ని వైద్యులు గమనించారు. కేవలం తల, కాళ్లపై మాత్రమే అక్కడక్కడా చర్మం కనిపిస్తోంది.
 
ఇది ఆటో ఇమ్యూన్ లోపం అని, వ్యాధినిరోధక శక్తికి సంబంధించిన సమస్య అని మెథడిస్ట్ ఆసుపత్రి వైద్య నిపుణులు తెలిపారు. ఈ విధమైన సమస్యతో వచ్చిన తొలి కేసు ఇదేనని, ఆ చిన్నారి బతకడం కష్టమేనని వైద్యులు చెప్పారు.
 
సాధారణంగా చర్మం మన శరీరానికి ఎంతో రక్షణ ఇస్తుంది. భౌతికంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా చర్మం విశిష్టత అంతాఇంతా కాదు. మానవదేహానికి చెందిన రోగనిరోధకశక్తికి తొలి కవచం చర్మమే. అయితే, అత్యంత బాధాకర పరిస్థితుల్లో ఓ చిన్నారి ఒంటిపై చర్మమే లేకుండా ఈ భూమిపైకి వచ్చింది.